»   » ‘ఊపిరి’పై మహేష్ కామెంట్, 'బ్రహ్మాత్సవం'కు లింక్

‘ఊపిరి’పై మహేష్ కామెంట్, 'బ్రహ్మాత్సవం'కు లింక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మొన్న శుక్రవారం విడుదలైన ఊపిరి చిత్రానికి సర్వాత్రా ప్రశంసలు వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం నాగార్జున కు సోగ్గాడే చిన్న నాయినా వంటి హిట్ తర్వాత రావటంతో కలెక్షన్స్ , ఓపినింగ్స్ అదిరిపోయాయి.

ఈ చిత్రం సాధారణ ప్రేక్షకులనే కాక, మహేష్ వంటి సూపర్ స్టార్స్ సైతం చూసి మెచ్చుకునేలా చేస్తోంది. ఇప్పటికే చాలా మంది దర్శకులు, హీరో,హీరోయిన్స్ ఈ సినిమా గురించి ట్వీట్ చేసారు. ఇప్పుడు మహేష్ సైతం ఓ ట్వీట్ తో సినిమా గురించి మాట్లాడారు.ఊపిరి సినిమాను చూసిన మహేష్, ట్విట్టర్ ద్వారా సినిమా అద్భుతంగా ఉందంటూ ట్వీట్ చేశారు. అబ్బురపరచే యాక్టింగ్ మరియు డైరెక్షన్ కలిపి ఊపిరి సినిమా ఔట్‍స్టాండింగ్ అనిపించేలా ఉందని తెలుపుతూ మహేష్, టీమ్‌కు కంగ్రాట్స్ తెలిపారు.


ఊపిరి నిర్మించిన పీవీపీ వారే...మహేష్ తాజా చిత్రం బ్రహ్మోత్సవానికి కూడా నిర్మాతలు కావటం విశేషం. వారే మహేష్ కు స్పెషల్ షో వేసి చూపించారని చెప్తున్నారు. మరి మహేష్ వంటి స్టార్ హీరో ఓ సినిమా ని మెచ్చుకుంటూ ట్వీట్ చేస్తే ఆ మైలేజే వేరు కదా.


Mahesh tweet about Oopiri movie

'ది ఇన్‌టచబుల్స్' అనే ఫ్రెంచ్ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన 'ఊపిరి'కి వంశీ పైడిపల్లి దర్శకుడు కాగా, పీవీపీ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించింది.


English summary
Mahesh Babu tweeted:"Brilliantly acted and directed .. Oopiri is an outstanding film .. Congrats to the entire team"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu