»   »  మహేష్ చెప్పింది నిజమే....వింటే మనకే మేలు

మహేష్ చెప్పింది నిజమే....వింటే మనకే మేలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈరోజు జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు హీరో మహేష్, ఓటర్లకు "ప్లీజ్ గో అండ్ ఓట్ టు మెక్ ఈచ్ ఓట్ కౌంట్" అంటూ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసారు. దీనికి సంబందించిన ట్వీట్ ను ఇక్కడ చూడండి.


ప్రజాస్వామ్యంలో ప్రజల ఆయుధం ఓటు. మంగళవారం జరుగనున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలుగు సినీ నటులు మహేశ్‌బాబు, రానా తదితరులు ఓటర్లకు పిలుపునిచ్చారు.

ఓటు వేసి హైదరాబాద్‌ ప్రగతిలో భాగస్వాములం అవుదాం అని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు వేసి ఓటు విలువను నిలబెట్టాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.

Mahesh tweeted for vote

మహేష్‌బాబు ప్రస్తుతం శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో ‘బ్రహ్మోత్సవం' సినిమాలో నటింస్తున్నారు. దీనితో పాటు మురుగుదాస్ డైరక్షన్ లో త్వరలో మెదలు కానున్న సినిమాకోసం సిద్దం అవుతున్నాడు మహేష్.

గతంలో మహేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్‌లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు' చిత్రం తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. దాంతో మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్‌లో ‘బ్రహ్మోత్సవం' రూపొందుతూండటంతో బిజినెస్ కూడా బాగా జరుగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పి.వి.పి.సినిమాస్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ నిర్మిస్తున్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''వినోదాత్మకంగా నడిచే కుటుంబ కథాచిత్రమిది. ముగ్గురు నాయికల పాత్రలకూ ప్రాధాన్యముంది. ఉమ్మడి కుటుంబంలోని సంతోషాలకు ప్రతిరూపంగా ఈ చిత్రం ఉంటుంది''అన్నారు. జయసుధ, రేవతి, నరేష్‌, రావు రమేష్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె.మేయర్‌ సంగీతమందిస్తున్నారు.

English summary
Mahesh Tweeted "Please go and vote to make each vote count!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu