»   » మహేష్ ...ట్రైలర్ ని షేర్ చేసి విషెష్ చెప్పాడు

మహేష్ ...ట్రైలర్ ని షేర్ చేసి విషెష్ చెప్పాడు

Written By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : మహేష్ బాబు ఏదైనా ట్వీట్ చేసారంటే అందులో ఏదో ఒక విశేషం ఉండాల్సిందే. తాజాగా ఆయన త్వరలో విడుదలకు సిద్దమవుతున్న చిత్రం తను-నేను కు చెందిన ట్రైలర్ ని షేర్ చేస్తూ, విషెష్ చెప్పారు.


అలాగే...ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్న హీరో మరెవరో కాదని, తనతో ప్రత్యేక అనుబంధం ఉన్న దర్శకుడు స్వర్గీయ శోభన్(బాబి దర్శకుడు, నాని మాటల రచయిత) కుమారుడు అని తెలియచేసారు.

అతని తొలి చిత్రం విడుదలకు సిద్దంగా ఉందని, శుభాకాంక్షలు తెలియచేసారు.

'తను నేను' విషయానికి వస్తే...

అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాల జంపాల చిత్రాల నిర్మాత రాంమోహన్‌ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కించిన చిత్రం 'తను నేను'. సంతోష్‌, అవికాగౌర్‌ జంటగా నటిస్తుండగా దర్శకుడు రవిబాబు ప్రధాన పాత్రలో కన్పించనున్నారు. ఈ సినిమా నవంబర్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

mahesh

అష్టాచమ్మా, ఉయ్యాలా జంపాలా వంటి హిట్‌ చిత్రాల నిర్మాత పి రామ్మోహన్‌ దర్శకుడిగా చేసిన తొలి చిత్రం 'తను నేను'. అవికా గోర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాతో 'వర్షం' చిత్ర దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ హీరోగా పరిచయమవుతున్నాడు.

ప్రముఖ నిర్మాత డి.సురేష్‌బాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ సంస్థలు నిర్మించారు.

English summary
Mahesh Babu Shared in twitter: I cherish fond memories of working with director late Sobhan. Am happy that his son Santosh Sobhan took up acting.. his debut film Tanu Nenu is set to release. Wish him all the success :)
Please Wait while comments are loading...