»   » నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో... మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేశారు!

నమ్రత షేర్ చేసిన ఈ ఫోటో... మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేశారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mahesh Babu Wife Namrata Has Shared A Picture

మహేష్ బాబు ఎలా ఉంటారంటే...సూపర్ స్టార్ కృష్ణకు జిరాక్స్ కాపీలా ఉంటారని అంటుంటారు అభిమానులు. తాజాగా మహేష్ బాబు సతీమని నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయింది. ఈ ఫోటో చూస్తుంటే తండ్రి కొడుకుల మధ్యక లుక్ పరంగా, స్టైల్ పరంగా ఎంత దగ్గరి పోలికలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.

సూపర్‌ స్టార్‌ కృష్ణ యువకుడిగా ఉన్నప్పటి ఫొటోకు, 'స్పైడర్‌' షూటింగ్‌ స్పాట్‌ లో మహేష్ దిగిన ఫొటోను జత చేసిన నమ్రత దాన్ని అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోకు 'అప్పుడు.. ఇప్పుడు. మా లెజెండరీ మామగారు, ఆయన అందమైన కుమారుడు' అంటూ ఓ కామెంట్ పెట్టి షేర్ చేశారు. ఈ ఫోటోను మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియాలో వైర్ చేశారు.

Then and now ❤️❤️my legendary father in law and his dapper son 👌👌


A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Aug 29, 2017 at 10:28pm PDTస్పైడర్

టాలీవుడ్ సూపర్‌స్టార్‌ మహేష్ బాబు హీరోగా ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'స్పైడర్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ జోరందుకున్నాయి. స్పైడర్ చిత్రానికి సంబంధించి ఇటీవల 'బూమ్‌ బూమ్‌' అనే తొలిపాటను రిలీజ్ చేయగా మంచి స్పందన వచ్చింది. త్వరలో మరో పాటను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మొదట విడుదల చేసిన పాటకు భిన్నంగా ఈ సాంగ్ ఉండబోతోంది.


పుచ్చకాయ పుచ్చకాయ

పుచ్చకాయ పుచ్చకాయ

‘పుచ్చకాయ పుచ్చకాయ' అనే లిరిక్‌తో రెండో పాట ఉంటుందని సమాచారం. ఈ పాటను ప్రముఖ బాలీవుడ్‌ గాయకుడు బ్రిజేశ్‌ శాండిల్య పాడారు. బ్రిజేశ్‌ ‘సరైనోడు' టైటిల్‌ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులకు గాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే.


అరబిక్ లిరిక్స్

అరబిక్ లిరిక్స్

‘పుచ్చకాయ..పుచ్చకాయ' పాట అరబిక్‌ లిరిక్స్‌తో వెరైటీగా ఉంటుందని, ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అంటున్నారు. తమిళ్‌, మలయాళం, అరబిక్‌లో భాషలో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టే ఇలా అరబిక్ లిరిక్స్ తో పాట పెట్టారట. స్పైడర్ చిత్రానికి హ్యారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు.


స్పైడర్

స్పైడర్

ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వంలో ఎన్‌.వి.ప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటోంది. సెప్టెంబర్‌ 27న విడుదల కాబోతోంది.


హిందీ రిలీజ్ చేయడం లేదు

హిందీ రిలీజ్ చేయడం లేదు

సినిమా ప్రారంభంలోనే తెలుగు, తమిళంలోనే చేయాలనుకున్నాం. హిందీలో చేయమాలనుకోలేదు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో షూట్‌ చేయడం వల్ల నేను వేసిన ప్లానింగ్‌ కంటే షూటింగ్‌కు ఎక్కువ రోజుల సమయం పట్టింది. ఒకేసారి రెండు భాషల్లో సినిమా చేయడం నాకు మొదటిసారి. రెండు భాషల్లో అయితే నేను మేనేజ్‌ చెయగలను... అందుకే హిందీలో చేయలేదని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తెలిపారు.English summary
Mahesh Babu is presently working on 'Spyder' which is in the finishing stages. Murugadoss team is picturising the last song in the beautiful locations of Romania. When Mahesh was relaxing in a shot gap, he gave a wonderful pose. Mahesh Babu wife Namrata has shared the pic through her Instagram with a caption 'Mahesh with his fan'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu