»   » ‘స్పైడర్‌’లో మహేశ్ గారాలపట్టి.. సూపర్ స్టార్ల మధ్య సితార.. రేర్ ఫోటోస్..

‘స్పైడర్‌’లో మహేశ్ గారాలపట్టి.. సూపర్ స్టార్ల మధ్య సితార.. రేర్ ఫోటోస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ తారలు ఎప్పుడూ షూటింగులు, సినిమా కార్యక్రమాలతో బిజీగా ఉంటారు. కుటుంబంతో గడిపే సమయమే దొరకదు. ఇక అగ్ర హీరోల పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. పిల్లలు లేవకముందే హీరోలు షూటింగులకు వెళ్తారు.. రాత్రి ఎప్పుడో పిల్లలు నిద్ర పోయిన తర్వాత గానీ తిరిగి ఇంటికి చేరుకోరు. ఇక అవుట్ డోర్ షూటింగ్ అయితే వారాలు, నెలల తరబడి పిల్లలను చూసే భాగ్యమే దక్కదు సినిమా హీరోలకు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్ ఇందుకు భిన్నంగా కాదు. ఎప్పుడైనా వీలు చిక్కితే పిలల్లతో గడిపేందుకే ఇష్టపడుతాడు ప్రిన్స్. తాజాగా మహేశ్‌బాబు కూతురు సితార స్పైడర్ చిత్రం షూటింగ్‌లో సందడి చేయడం అభిమానులను ఆకట్టుకొన్నది.

స్పైడర్‌లో మహేశ్ ముద్దుల కూతురు

స్పైడర్‌లో మహేశ్ ముద్దుల కూతురు

ప్రస్తుతం మహేశ్‌బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పైడర్ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. ఈ చిత్రం షూటింగ్‌కు సితార వచ్చి తన తండ్రితో సంతోషంగా టైమ్ స్పెండ్ చేసింది. షాట్‌కు షాట్ మధ్య సితారతో మహేశ్ అప్యాయంగా ముచ్చటించడం చిత్ర యూనిట్‌ను ఆకట్టుకొన్నది. ప్రిన్స్, సితార ఆప్యాయంగా మాట్లాడుకోవడాన్ని క్లిక్ మనిపించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


Mahesh babu disappointed on Spyder Movie Delay
కెమెరాలో బంధించిన సంతోష్ శివన్

కెమెరాలో బంధించిన సంతోష్ శివన్

ఇంతకీ తండ్రి కూతుళ్ల అరుదైన క్షణాలను కెమెరాలో బంధించిందేవరంటే.. స్పైడర్ చిత్ర సినిమాటోగ్రఫర్ సంతోష్ శివన్. వాటిని కెమెరాలో బంధించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేశారు. దాంతో ప్రిన్స్, సితార ఫోటోలు వైరల్‌గా మారాయి.


మా సెట్‌కు ప్రియమైన అతిథి..

మా సెట్‌కు ప్రియమైన అతిథి..

మా సెట్‌కు ప్రియమైన అతిథి ఒకరు వచ్చారు. ఆ గెస్ట్ ఎవరో చూడండి అంటూ ఓ సందేశాన్ని ట్యాగ్ చేశారు ప్రముఖ దర్శక, కెమెరామెన్ సంతోష్ శివన్. సంతోష్ శివన్ షేర్ చేసిన ఫొటోకు అత్యధిక సంఖ్యలో కామెంట్లు, లైక్ రావడం విశేషం.


రకుల్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు వైరల్..

రకుల్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటోలు వైరల్..

మహేశ్, సితార కలిసి అప్యాయంగా ఉన్న ఫొటోలను హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు. సితారను ఒడిలో కూర్చొబెట్టుకొని ఆటపట్టిస్తున్న రకుల్ ఫోటో కూడా అభిమానులను ఆకట్టుకొంటున్నది.


సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో హల్‌చల్

సోషల్ మీడియాలో ఫొటోలు కనిపించగానే స్పైడర్ చిత్రంలో సితార నటిస్తున్నదంటూ వార్తలు ప్రచారమయ్యాయి. అయితే ఆ తర్వాత సితార కేవలం తండ్రిని కలువడానికే షూటింగ్‌కు వెళ్లిందనే విషయంపై క్లారిటీ రావడంతో గాసిప్స్‌కు తెరపడ్డాయి.


శ్రీమంతుడు షూటింగ్‌లో కూడా..

శ్రీమంతుడు షూటింగ్‌లో కూడా..

గతంలో కూడా శ్రీమంతుడు చిత్రం షూటింగ్ సందర్భంగా మహేశ్‌ను కలువడానికి సితార సెట్‌కు వెళ్లింది. ఆ సందర్భంగా కూడా సితార ఫొటోలు అందర్ని ఆకర్షించాయి. సితార, గౌతమ్ కృష్ణ అంటే ప్రిన్స్ మహేశ్‌కు చాలా ఇష్టం. షూటింగ్‌ లేకపోతే పిల్లలతో కలిసి విదేశాల్లో హాలీడే ప్లాన్ చేస్తారు.


అప్పుడప్పుడు గౌతమ్ కృష్ణ

అప్పుడప్పుడు గౌతమ్ కృష్ణ

మహేశ్ కుమారుడు గౌతమ్ కూడా అప్పుడప్పుడు సినిమా సెట్లో సందడి చేస్తాడు. 1 నేనొక్కడినే అనే సినిమాలో చిన్నప్పటి మహేశ్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ చిత్రంలో అద్భుతమైన నటనతో తండ్రికి తగిన కొడుకు అనిపించుకోవడం గమనార్హం.


సూపర్ స్టార్ కృష్ణ షూటింగ్‌లకు ప్రిన్స్ మహేశ్

సూపర్ స్టార్ కృష్ణ షూటింగ్‌లకు ప్రిన్స్ మహేశ్

ప్రిన్స్ మహేశ్ తన చిన్నతనంలో తండ్రి సూపర్ స్టార్ కృష్ణ నటించే సినిమా షూటింగులకు హాజరయ్యేవారు. అప్పట్లో కృష్ణ చిత్రాలు ఎక్కువగా ఊటీలో షూటింగ్‌ జరిగేవి. వేసవి కాలంలో సమయంలో మహేశ్‌తోపాటు కుటుంబమంతా కృష్ణతోనే ఉండేది. బాలనటుడిగా మహేశ్‌ను సినిమా తెరకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే.


సినిమాల్లోకి సితార ఎప్పుడో..

సినిమాల్లోకి సితార ఎప్పుడో..

తండ్రిలానే మహేశ్ కూడా గౌతమ్‌ మాదిరిగానే సితారను బాలనటిగా పరిచయం చేస్తాడా అనే విషయాన్ని వేచిచూడాల్సిందే. ప్రస్తుతం పిల్లలను చదువుపైనే దృష్టి కేంద్రీకరించేలా ప్రిన్స్ మహేశ్ చర్యలు తీసుకొంటున్నారు.English summary
Prince Maheshbabu daughter Sitara spotted in Spyder shooting. She went to Spyder shooting recently. Cameraman Sathosh Sivan captured the best moments of Mahesh, Sitara and posted into Social media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu