»   »  తిరుపతిలో 'మహేశ్వరి' మ్యారేజ్

తిరుపతిలో 'మహేశ్వరి' మ్యారేజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Maheswari
'గులాబి' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన మహేశ్వరి పెళ్ళి చేసుకోబోతోంది. తమిళ నటుడు జయకృష్ణ ఆమె కాబోయే భర్త. ఈ నెల 18న తిరుమలలో వివాహం జరగనుంది. ప్రముఖ నటి శ్రీదేవి సోదరిగా మహేశ్వరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తమిళంలో 'కరుతమ్మా' చిత్రంతో ప్రేక్షకాదరణ పొందారు. తెలుగులో 'గులాబి', 'పెళ్లి', 'మృగం', 'దెయ్యం', 'తిరుమల తిరుపతి వెంకటేశ' లాంటి చిత్రాల్లో నటించారు. ఇటీవల వెండి తెరకు దూరమై బుల్లి తెరకే మహేశ్వరి పరిమితమయ్యారు. మహేశ్వరి మాట్లాడుతూ ''నటన అంటే నాకెంతో ఇష్టం. వివాహానంతరం కూడా సినిమాలు, సీరియళ్లలో నటిస్తాను'' అని చెప్పారు. ప్రస్తుతం ఆమె మై నేమ్ ఈజ్ మంగతాయారు సీరియల్ లో టైటిల్ రోల్ చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X