»   »  మహేశ్వరి మ్యారేజి...

మహేశ్వరి మ్యారేజి...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Maheswari
హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన శ్రీదేవి పిన్నమ్మ కూతురైన మహేశ్వరి త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. అయితే ఎరేంజెడ్ మ్యారేజ్ కాదట...లవ్ మ్యారేజ్ చేసుకొంటోంది. ఆమె కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ప్రేమలో మునిగి తేలుతోంది. అయితే వారి ప్రేమను పెద్దలు అంగీకరించక పోవడంతో తల్లిదండ్రుల నుంచి విడివడి అయినా పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. ఛివరికి సినిమాల్లోలాగానే పెద్దలు దిగిరాక తప్పలేదు.

'గులాబి', 'మృగం', 'పెళ్లి', 'దెయ్యం' సినిమాల హీరోయిన్ అయిన ఆమెకు ప్రస్తుతం సినిమాల్లో ఆఫర్స్ లేక జీ తెలుగు చానల్‌లో ప్రసారమవుతున్న 'మై నేమ్ ఈజ్ మంగతాయారు' సీరియల్‌లో టైటిల్ పాత్రను పోషిస్తోంది. ఆమె పెళ్లి తేదీ మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కెరీర్ మొదట్లో తన సహ నటుడు జెడి చక్రవర్తి ప్రేమలో నిండా మునిగి, హైదరాబాద్ రోడ్ల మీద చక్కర్లు కూడా కొట్టిన మహేశ్వరి, ఆ తర్వాత అతడితో పొసగక ఆ ప్రేమకు స్వస్తి పలికింది. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడి, ఆ ప్రేమను పెళ్లిదాకా తీసుకు రాగలిగింది. యేదైమైనా త్వరలో ఒకింటామే కాబోతున్న మహేశ్వరికి వివాహ శుభాకాక్షలు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X