ఓ ప్రక్క రెచ్చగొడుతూ.. 'డోంట్ టచ్ మై బాడీ' అంటోంది
ముంబై : రామ్‌చరణ్ 'తుఫాన్'లో మోనా డార్లింగ్‌గా కనిపించి కుర్రకారును ఆకర్షించేసిన కత్తి లాంటి అమ్మాయి గుర్తుందా... ఆమే... మహిగిల్. 'బుల్లెట్ రాజా' చిత్రంలో డోంట్ టచ్ మై బాడీ... అనే హాట్ ఐటం సాంగ్ లో ఆడిపాడింది. ఆమె ఐటెమ్‌గాళ్‌గా కనిపించే తొలి చిత్రమిదే. 'డోంట్ టచ్ మై బాడీ' గీతాన్ని ఇటీవల గణేష్ ఆచార్య నేతృత్వంలో తెరకెక్కించారు.
హీరోయిన్ గా నటిస్తే ఎంత పేరొస్తుందో... ఐటం సాంగ్ చేసినా అదే స్థాయి గుర్తింపు లభిస్తుంది. అందుకే ఇటీవల ప్రత్యేకగీతం అనేసరికి హీరోయిన్స్ ఏ మాత్రం ఆలోచించకుండా సై అనేస్తున్నారు. వాటికి లభించే ప్రచారం అంతా ఇంతా కాదు మరి. సినిమా విడుదలకు ముందే బయటికొస్తుంది. సినిమా విడుదలైపోయాక కూడా అదేస్థాయిలో సందడి చేస్తుంటుంది. అందుకే ఐటం సాంగ్స్ ను వదులుకోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అందుకే మహి గిల్ ఉత్సాహంగా చేసేసింది.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్,సోనాక్షి సిన్హా కాంబినేషన్ లో బుల్లెట్ రాజా రూపొంది ఈ రోజే విడుదల అవుతోంది. ఈ చిత్రం మాఫియా నేపధ్యంలో రూపొందింది. ఈ చిత్రాన్ని తగ్ మన్షు ధులియా డైరక్ట్ చేసారు. ఈ చిత్రం మాస్ మసాలా చిత్రం గా రూపొందిందని,తప్పనిసరిగా ఘన విజయం సాధిస్తుందని చెప్తున్నారు.


Click it and Unblock the Notifications











