»   » దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో యువతి ఆత్మహత్య

దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో యువతి ఆత్మహత్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు దర్శకుడు కోదండ రామిరెడ్డి ఇంట్లో పనిచేస్తున్న యువతి ఆత్మహత్యకు పాల్పడటం ఫిల్మ్ నగర్ లో చర్చనీయాంశం అయింది. తూర్పు గోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన యువతి జయశ్రీ (19) సంవత్సర కాలంగా కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తూ....అదే ఇంటిఆవరణలోనే ఉన్న గదిలో నివాసం ఉంటోంది.

పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం ఇటీవల స్వగ్రామానికి వెళ్లిన ఆ యువతి, తిరిగి వచ్చేటప్పుడు తన తల్లి నాగమణిని కూడా తన వెంట తీసుకొచ్చింది. అప్పటి నుండి ఇద్దరూ కోదండరామిరెడ్డి ఇంట్లో చేస్తున్నారు.

Maid suicide at director Kodandarami Reddy house

తన తల్లి బయటకు వెళ్లి వచ్చే సరికి జయశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మరి జయశ్రీ ఇలా చేయడం వెనక కారణం ఏమిటి? అనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జయశ్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

English summary
Maid suicide at Tollywood senior director Kodandarami Reddy house. Police register the case and investigating is started.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu