»   » సుప్రీం కోర్టుకు రజనీకాంత్ కేసు?

సుప్రీం కోర్టుకు రజనీకాంత్ కేసు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తన అనుమతి లేకుండా తన పేరును వాడుకుంటున్నారని, తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే. ‘మై హూ రజనీకాంత్' అంటూ ఓ సినిమాకు టైటిల్ పెట్టిన నేపథ్యంలో రజనీకాంత్ హై కోర్టు కెక్కారు. కోర్టు తీర్పు రజనీకాంత్ కు అనుకూలంగా రావడం, టైటిల్ మార్చాలని కోర్టు సూచించిన సంగతి తెలిసిందే.

అయితే ఈ చిత్ర దర్శక నిర్మాతలు ఈ విషయాన్ని సుప్రీం కోర్టులో తేల్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై దర్శకుడు పైజల్ సైఫ్ మాట్లాడుతూ....నాకు రజనీకాంత్ తో గొడవ పడటం ఇష్టం లేదు. టైటిల్ మార్చాలనే అనుకుంటున్నాను. కానీ నిర్మాతలు సుప్రీం కోర్టుకు వెళదామని అంటున్నారని, ఈ కేసు తేలే వరకు వెయిట్ చేస్తాను అన్నారు.

ఈచిత్రం రజనీకాంత్ జీవిత చరిత్ర గురించి అస్సలుకాదని.....అసలు ఇందులో సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రస్తావ ఉందని, అభిమానుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి సన్నివేశాలు ఉండబోవని దర్శకుడు ఫైజల్ సైఫ్ స్పష్టం అప్పట్లో చేసారు. కేవలం ఇది వినోదాత్మక చిత్రం, ఎవరినీ ఉద్దేశించి ఈ చిత్రం ఉండదు అంటున్నారు.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Main Hoon Rajinikanth case to Supreme Court

‘మై హూ రజనీకాంత్' అనేది ఓ హిందీ చిత్రం. ఫైజల్ సైఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సరోజ్ నిర్మిస్తున్నారు. ఆదిత్యయ మీనన్, కవితా రాధేశ్యామ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇదొక కామెడీ చిత్రం. బప్పి లహరి, సాహిబని కశ్యప్ సంగీతం అందిస్తున్నారు.

English summary
The battle between Rajinikanth and the makers of the Bollywood film Main Hoon Rajinikanth has come to an end. The makers have lost the case and the court has asked them to change the title. While the director Faisal Saif is keen to go for a change, the producers are willing to take the case to the Supreme Court.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu