»   »  ఏదో ఆందోళన..భయం: ఇలియానా

ఏదో ఆందోళన..భయం: ఇలియానా

Posted By:
Subscribe to Filmibeat Telugu

''ఏంటో ఈ సినిమా ప్రచార చిత్రం విడుదల అంటే మనసులో ఏదో ఆందోళన... భయం వేస్తున్నాయి. నా తొలి సినిమా (దేవదాస్‌) రోజులు గుర్తుకొస్తున్నాయి'' అంటోంది ఇలియానా. ఇటీవల 'మైనే తేరా హీరో' సినిమా ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇలియానా మాట్లాడుతూ ఇలా స్పందించింది.

తెలుగులో ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు 'బర్ఫీ'తో బాలీవుడ్‌లో ప్రవేశించింది. తొలి సినిమా ఆశించిన ఫలితాన్నే ఇచ్చినప్పటికీ ఆ తర్వాత వచ్చిన 'ఫటా పోస్టర్‌ నిక్లా హీరో' ఇబ్బందికర ఫలితాన్నే ఇచ్చింది. అయినా పట్టువదలని పోగొట్టుకున్న చోటే సంపాదించాలనుకొని అక్కడే ఉండిపోయింది. ఇప్పుడు హిందీలో 'హ్యాపీ ఎండింగ్‌', 'మైనే తేరా హీరో' సినిమాల్లో నటిస్తోంది. ఇప్పుడు ఈ రెండూ వారం వ్యవధిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

తెలుగులో రామ్ హీరోగా వచ్చి ఘన విజయం సాధించిన చిత్రం 'కందిరీగ'. హన్సిక హీరోయిన్ గా చేసిన ఈ సినిమా 'మై తేరా హీరో' పేరుతో హిందీలో రీమేక్ అవుతోంది. డేవిడ్ ధావన్ డైరెక్ట్ చేస్తున్న ఆ సినిమాలో ఆయన కుమారుడు వరుణ్ ధావన్, ఇలియానా హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏక్తా కపూర్ నిర్మిస్తున్నారు

''జీవితంలో ఇప్పటివరకు నేను సాధించిన, సంపాదించిన వాటితో చాలా సంతృప్తిగా ఉన్నాను. దేవుని దయ వల్ల ఇప్పటి దాకా నా జీవితం సాఫీగా సాగుతోంది. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఇప్పటి వరకు నా జీవితంలో జరిగిన ప్రతి చిన్న విషయం గుర్తుంది. ఎందుకంటే ఆ విషయాలే నా ఆనందానికి కారణం'' అంటోంది ఇలియానా.

English summary
The trailer of one of the most anticipated films of the year 'Main Tera Hero' was launched. The king of comedies 'David Dhawan' will be seen directing his younger son Varun Dhawan for the very first time.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu