»   » ‘మైనే ప్యార్ కియా’ చిత్రం విడుదల తేదీ ఖరారు

‘మైనే ప్యార్ కియా’ చిత్రం విడుదల తేదీ ఖరారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రదీప్, ఇషా తల్వార్ జంటగా నటించిన 'మైనే ప్యార్ కియా' చిత్రం విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని జూన్ 20న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవలే ఈచిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసింది. ప్రదీప్ మాడుగుల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని యునిఫై క్రియేషన్స్ పతాకంపై సానా వెంకటరావు నిర్మించారు. ఉపేంద్ర, వెన్నెల రామారావు సహ నిర్మాతలు.

ఈ చిత్రం ఐ.టి కంపెనీ బ్యాక్ డ్రాప్‌లో సాగుతుంది. ఒకే కంపెనీ లో పని చేస్తున్న ఒక యువ జంట మధ్య ప్రేమ నేపథ్యంలో సాగుతుంది. ఈ చిత్ర కథకీ, పాత హిందీ చిత్రం "మైనే ప్యార్ కియా" ఎటువంటి సంబంధం లేదు. ఈ చిత్రం వినూత్నమైన ప్రేమకథా చిత్రంగా, పూర్తిస్థాయి ఎంటర్‌టైనర్‌తో అన్నివర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని నిర్మాత తెలిపారు.

'Maine Pyaar Kiya' release date

సినిమా గురించి యూనిట్ సభ్యులు వెల్లడిస్తూ...'మైనే ప్యార్ కియా' చిత్రం సెన్సాన్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్ 20న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. యూత్ ఫుల్ రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుందని ఆశిస్తున్నాం' అన్నారు.

ముఖ్య పాత్రల్లో కోమల్ ఝూ, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్, వెన్నెల రామారావు, వైవ హర్ష, వేణు, శివన్నారాయణ, ఉత్తేజ్, మధుమిత, సత్యదేవ్, కోటేశ్వరరావు, తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్ కుమార్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి. విశ్వా, నిర్మాతలు: సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్ గిరడ, దర్శకత్వం: ప్రదీప్ మాడుగుల.

English summary
'Maine Pyaar Kiya' release date June 20. Pradeep, Isha Talwar starrer Maine Pyaar Kiya has completed its censor formalities and it has been given U/A certificate. The film has been directed by Pradeep Madugula and it has been produced by Sana Venkat Rao and Upendra Kumar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu