»   » హీరో, హీరోయిన్లు ఆటో రిక్షా ప్రచారం (ఫోటోలు)

హీరో, హీరోయిన్లు ఆటో రిక్షా ప్రచారం (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రదీప్‌, ఇషా తల్వార్‌ హీరోహీరోయిన్లుగా యునిఫై క్రియేషన్స్‌ బేనర్‌పై ప్రదీప్‌ మాడుగుల దర్శకత్వంలో సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌ గిరడ నిర్మిస్తున్న రొమాంటిక్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ 'మైనే ప్యార్‌ కియా'. ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. సినమా ప్రమోషన్లో భాగంగా ఆటో రైడ్ ప్రారంభించారు.

ఆటో రైడ్‌కు సంబంధించిన ఫోటోలు, సినిమా విడుదల సందర్భంగా నిర్మాత చెప్పిన విశేషాలు స్లైడ్ షోలో...

నిర్మాతలు మాట్లాడుతూ..

నిర్మాతలు మాట్లాడుతూ..

ఈ సందర్భంగా నిర్మాత సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌ గిరడ మాట్లాడుతూ - ''మా 'మైనే ప్యార్‌ కియా' చిత్రం ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. మంచి ఓపెనింగ్స్ సాధించింది. సినిమా పాటలు ఆల్రెడీ పెద్ద హిట్ అయ్యాయి. సినిమా రిలీజ్ తర్వాత విజువల్‌గా కూడా ఈ పాటల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాపై మేం పెట్టుకున్న నమ్మకాన్ని హండ్రెడ్ పర్సంట్ నిలబెట్టారు అన్నారు.

ఆటో రైడ్

ఆటో రైడ్

సినిమా ప్రమోషన్ డిఫరెంటుగా చేయాలన్న ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని ఆటో రైడ్ నిర్వహించాం. దానికి ప్రేక్షకుల నుండి చాలా మంది స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు మా ధన్యవాదాలు అన్నారు.

నటీనటులు

నటీనటులు

ఈ చిత్రంలో కోమల్‌ ఝా, పోసాని కృష్ణమురళి, ప్రవీణ్‌, వెన్నెల రామారావు, వైవ హర్ష, వేణు, శివన్నారాయణ, ఉత్తేజ్‌, మధుమిత, సత్యదేవ్‌, కోటేశ్వరరావు, సోలో ఫేం స్వప్నిక, సుధాకర్‌వర్మ, కత్తి మహేష్‌, కుమార్‌ తేజ, సర్వమంగళ, ల్యాబ్‌ శరత్‌, ముద్దమందారం ప్రదీప్‌, సరస్వతి, సురేష్‌, ప్రాచి తదితరులు నటించారు.

సాంకేతిక విభాగం

సాంకేతిక విభాగం

ఈ చిత్రానికి సంగీతం: ప్రదీప్‌కుమార్‌ వి., సినిమాటోగ్రఫీ: ఎస్‌.వి.విశ్వా, లైన్‌ ప్రొడ్యూసర్‌: వెన్నెల రామారావు, నిర్మాతలు: సానా వెంకటరావు, ఉపేంద్రకుమార్‌ గిరడ, దర్శకత్వం: ప్రదీప్‌ మాడుగుల.

English summary
Pradeep, Isha Talwar acted Maine Pyar Kiya film released today, to promote the film unit organised auto ride at Hyderabad today.
Please Wait while comments are loading...