»   »  102వ చిత్రం కోసం బాలకృష్ణ భారీగా.. ‘కుంభకోణం’

102వ చిత్రం కోసం బాలకృష్ణ భారీగా.. ‘కుంభకోణం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత శరవేగంగా 101వ చిత్రం పైసా వసూల్‌ను రాకెట్ స్పీడ్‌తో పూర్తి చేస్తూనే 102వ చిత్రానికి సిద్ధమవుతున్నాడు. జయసింహ అనే చిత్రానికి ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తమిళనాడులోని కుంభకోణంలో లాంగ్ షెడ్యూల్‌కు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేని విధంగా బాలయ్య వరుస చిత్రాలతో దూసుకెళ్లడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

సెప్టెంబర్ 29న పైసా వసూల్

సెప్టెంబర్ 29న పైసా వసూల్

పూరీ జగన్నాథ్ చిత్రం పైసా వసూల్ కోసం దాదాపు నెల రోజులపాటు పోర్చుగల్ లాంగ్ షెడ్యూల్ పూర్తి చేశారు. అక్కడే బాలయ్య తన జన్మదినోత్సవాన్ని జరుపుకొన్నారు. పోర్చుగల్‌లో తీసిన యాక్షన్ పార్ట్ సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈచిత్రం సెప్టెంబర్ 29న రిలీజ్ ఏర్పాట్లు చేస్తున్నారు.

డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్

డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌కు బాలయ్య గ్రీన్ సిగ్నల్

ఇక అదే ఊపులో ప్రముఖ దర్శకుడు కేఎస్ ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య త‌న 102వ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జ‌య‌సింహ అనే టైటిల్‌ ప్రచారమవుతున్నది. దర్శకుడు కెఎస్ ర‌వికుమార్ ఇప్ప‌టికే ఈ ప్రాజెక్టుకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ పూర్తి చేయ‌డంతో జూలై 10 నుంచి చిత్రీక‌ర‌ణ జ‌ర‌పాల‌ని భావిస్తున్నారు. సంక్రాంతికి త‌ప్ప‌క ఈ సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాల‌నేది యూనిట్ ప్లాన్ గా తెలుస్తుంది.

పక్కా ప్రణాళికతో జయసింహ

పక్కా ప్రణాళికతో జయసింహ

జయసింహ షూటింగ్‌కు సంబంధించిన పక్కా ప్రణాళికతో చిత్ర యూనిట్ ముందుకెళ్తున్నట్టు సమాచారం. ఈ చిత్ర షూటింగ్ మేజ‌ర్ పార్టును ఆగస్టులో త‌మిళనాడులో జ‌ర‌ప‌నున్నార‌ట‌. ఈ చిత్రంలో బాల‌య్య ఫ్యాక్ష‌నిస్ట్ గా క‌నిపించ‌నున్నాడ‌నేది ఫిలిం వ‌ర్గాల స‌మాచారం.

కుంభకోణంలో 40 రోజులు

కుంభకోణంలో 40 రోజులు

ఇప్ప‌టికే క‌థకి సంబంధించి షూటింగ్ లొకేష‌న్స్ కూడా ర‌వికుమార్ ఫైన‌ల్ చేశాడ‌ట‌. త‌మిళనాడులో టెంపుల్ సిటీగా చెప్ప‌బ‌డే కుంభ‌కోణంలో 40 రోజుల పాటు భారీ షెడ్యూల్‌కు ప్లాన్ చేసినట్టు తెలుస్తున్నది. ఫ్యాక్ష‌న్ నేపథ్యమున్న చిత్రాలన్ని రాయ‌ల‌సీమలో తెర‌కెక్కిన సంగతి తెలిసిందే. జయసింహ అందుకు భిన్నంగా తమిళనాడులో షూటింగ్ జరుపుకోవడం గమనార్హం. ఈ చిత్ర కథ స‌మ‌రసింహారెడ్డి మాదిరిగానే ఉంటుందని, కాకపోతే కొత్త బాలయ్యను చూస్తారనే లేటెస్ట్ న్యూస్.

ప్రధాన భాగమంతా తమిళనాడులో

ప్రధాన భాగమంతా తమిళనాడులో

జయసింహ షూటింగ్‌కు సంబంధించి ప్రధాన భాగమంతా త‌మిళనాడులో చిత్రీకరించనున్నట్టు సమాచారం. మిగితా షూటింగ్‌ను తెలుగు రాష్ట్రాల్లో జరిపే విధంగా ప్లాన్ చేశారు. పాటల కోసం చిత్ర యూనిట్ విదేశాలకు వెళ్తుంది. సీ క‌ళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా, హీరో శ్రీకాంత్ విల‌న్ పాత్ర పోషించ‌నున్నాడ‌ని టాక్.

English summary
Actor Balakrishna will next be seen in senior Tamil director KS Ravikumar’s direction. The film’s regular shooting will commence from the second week of August. As per the latest updates, the yet to be titled film will kick start the shooting in Kumbakonam of Tamil Nadu.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu