twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మరణానికి ముందు శ్రీదేవి.. దుబాయ్‌లో ఆమెకు.. అంటూ మేకప్‌ మ్యాన్ కంటతడి..

    By Rajababu
    |

    ఐదు దశాబ్దాలకుపైగా వెండితెరను ఏలిన శ్రీదేవి ఆకస్మిక మరణంతో కోట్లాది సినీ ప్రేక్షకులను కన్నీటి సాగరంలో మునిగిపోయారు. ఫిబ్రవరి 24న రాత్రి 11.30 గంటలకు శ్రీదేవి దుబాయ్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం శ్రీదేవి మరణానికి సంబంధించి గానీ, ఆమె వ్యక్తిగత జీవితం గురించి ఎవరేమీ చెప్పినా ప్రాధాన్యం సంతరించు కొంటున్నది. పెళ్లి కార్యక్రమంలో పాల్గొనేందుకు దుబాయ్ వెళ్లిన శ్రీదేవి మేకప్‌మెన్ సుభాష్ షిండే ఆమెకు సంబంధించిన విషయాలను మీడియాతో పంచుకొన్నారు.

    Recommended Video

    Sridevi : Cops Question Boney Kapoor, Statement Recorded
    మరణవార్తతో షాక్

    మరణవార్తతో షాక్

    శనివారం రాత్రి శ్రీదేవి చనిపోయారనే వార్త తెలిస్తే నమ్మశక్యం కాలేదు. మొహిత్ మార్వా పెళ్లి కోసం ఆమె వెంట దుబాయ్‌కి వెళ్లాను. పెళ్లి సమయంలో గతంలో ఎన్నడూ లేనంతగా శ్రీదేవి అందంగా కనిపించింది. చాలా సంతోషంగా ఉంది.

    రెండు రోజుల క్రితమే

    రెండు రోజుల క్రితమే

    శ్రీదేవి మరణానికి రెండు రోజుల క్రితమే నేను ముంబైకి వచ్చాను. శ్రీదేవి మరణవార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇంకా ఆ షాక్ నుంచి నేను కోలుకోలేకపోతున్నాను. ఇంకా ఆమె బతికి ఉందనే భ్రమలో ఉన్నాను. ఆమె లేని లోటు తీర్చలేనిది అని సుభాష్ షిండే ఆవేదన చెందాడు.

    కుటుంబంలా చూసుకొనే వారు

    కుటుంబంలా చూసుకొనే వారు

    సినీ దిగ్గజాలలో శ్రీదేవికి ఎవరూ సాటిరారు. ఆమె సహృదయులు. పాజిటివ్ దృక్పథంతో ఉంటారు. ఇంగ్లీష్ వింగ్లీష్ రిలీజైన తర్వాత నుంచి ఆమె వద్ద పనిచేస్తున్నాను. మేకప్ ఆర్టిస్టులను, క్యాస్టూమర్స్‌ను, ఇతర కళకారులను ఆమె తన కుటుంబ సభ్యులుగా చూసుకొనేది అని ఈ సందర్భంగా గుర్తు చేసుకొన్నారు.

    శ్రీదేవి గొప్ప పెయింటర్

    శ్రీదేవి గొప్ప పెయింటర్

    నేను ఆమెతో పనిచేసున్నప్పటి నుంచి చాలా మంచిగా చూసుకొనేది. టైమ్‌కు తింటున్నావా? మీ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు అని ఎప్పుడూ అడుగుతూ ఉండేది. ఆమె ఓ గొప్ప పెయింటర్. రంగుల గురించి ఆమెకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. శ్రీదేవి ధరించే దుస్తుల విషయంలో ఆమెకు గొప్ప అవగాహన ఉండేది

    కట్టు, బొట్టు విషయంలో

    కట్టు, బొట్టు విషయంలో

    శ్రీదేవికి అన్ని విషయాలపైనా మంచి అవగాహన ఉంది. చాలా విషయాలు ఆమె నుంచి నేర్చుకొన్నాను. సృజనాత్మకత విషయంలో ఆమెకు ఆమె సాటి అని షిండే వెల్లడించారు. నగలు, కలర్స్, ఇతర విషయాలపై ప్రత్యేక శ్రద్ధ చూపించే వారు. ముఖ్యంగా బొట్టు విషయంలో పర్టిక్యులర్‌గా ఉండేవారు అని షిండే చెప్పారు.

    ఎప్పుడూ విసిగించుకోలేదు..

    ఎప్పుడూ విసిగించుకోలేదు..

    తమిళ చిత్రం పులి, హిందీ చిత్రం మామ్ సినిమాలకు శ్రీదేవితో కలిసి పనిచేశాను. పులి సినిమా షూటింగ్‌లో ఆమె చాలా బరువున్న దస్తులు, నగలు ధరించాల్సి వచ్చేది. ఆ విషయంలో ఆమె ఎప్పుడూ విసిగించుకోలేదు. చాలా సహనంతో పనిచేసేవారు. చాలా సమయం తీసుకొన్నగానీ యూనిట్‌కు చాలా ఓపికగా సహకరించేవారు.

    English summary
    Sridevi was 54 when she passed away in Dubai late on Saturday night. She was seen in Mom for the last time. Subhash Shinde, who did Sridevi’s make-up at actor Mohit Marwah’s marriage in Dubai last week, says the late actor had “so much warmth and positivity” and always treated everyone, including make-up artistes, present on a film’s set like a family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X