»   » తప్పడం లేదు: పవన్ కళ్యాణ్‌‌‌‍ను టెస్ట్ చేస్తున్నారు!

తప్పడం లేదు: పవన్ కళ్యాణ్‌‌‌‍ను టెస్ట్ చేస్తున్నారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు బహుషా ఇలాంటి పరిస్థితి ఎప్పుడు ఎదురుకాలేదేమో! ఏ విషయం గురించి అని అలోచిస్తున్నారా? అదే నండీ 'గోపాలా గోపాలా' సినిమా గురించి. ఈచిత్రంలో పవన్ కళ్యాణ్ భగవంతుడైన గోపాలుడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గెటప్ ఎలా ఉంటే బాగుంటుందనే ఆలోచనలో పడ్డ దర్శక నిర్మాతలు ఆయనకు వివిధ రకాలుగా మేకప్, గెటప్స్ వేసి టెస్ట్ చేస్తున్నారట. వీటిలో బెస్ట్ గెటప్ మనకు సినిమాలో చూపించబోతున్నారు.

Makeup Test for Pawan Kalyan

వెంకటేష్, పవన్ కళ్యాణ్ మల్టీ స్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ వేగం పుంజుకుంది. ఇటీవలే పవన్ కళ్యాణ్ కూడా షూటింగులో జాయిన్ కావడంతో ఫుల్ స్వింగ్‌తో పనులు జరుగుతున్నాయి. ఈచిత్రాన్ని అక్టోబర్ 23న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్రాన్ని 'సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఈ చిత్రానికి కథ: భవేష్ మందాలియ, ఉమేష్ శుక్ల, స్క్రీన్ ప్లే: కిషోర్ కుమార్ పార్ధసాని, భూపతి రాజా, దీపక్ రాజ్, కెమెరా: జయనన్ విన్సెంట్, మాటలు : సాయి మాధవ్, సంగీతం : అనూప్ రూబెన్స్, పాటలు : చంద్ర బోస్, ఎడిటింగ్ : గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, కొరియో గ్రఫీ : సుచిత్ర చంద్రబోస్, కో డైరెక్టర్స్ : పూసల రాధాకృష్ణ, వై.శ్రీనివాస రెడ్డి, ప్రొడక్షన్ ఎగ్జి క్యుటివ్స్ : వీరేన్ తంబి దొరై, భాస్కర రాజు, అభిరామ్, దర్శకత్వం: డాలి.

English summary

 Power Star Pawan Kalyan is set to act as Lord Krishna in upcoming film Gopala Gopala and the actor has underwent makeup test for the role.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu