»   » 'బాహుబలి' ఏడాది పూర్తైంది... (మేకింగ్‌ కొత్త వీడియో)

'బాహుబలి' ఏడాది పూర్తైంది... (మేకింగ్‌ కొత్త వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రభాస్‌ హీరోగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బాహుబలి'. అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం షూటింగ్‌ గత ఏడాది జులై నెలలో ప్రారంభమైంది. షూటింగ్‌ ప్రారంభమై ఏడాది పూరైన సందర్భంగా చిత్ర బృందం సినిమా మేకింగ్‌ విశేషాలతో ఓ వీడియోను విడుదల చేసింది.

దీంతో పాటు ఈ చిత్రం లైన్‌ ప్రొడ్యూసర్‌, ఎం.ఎం.కీరవాణి సతీమణి శ్రీవల్లి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆమెకు చిత్ర బృందం శుభాకాంక్షలు తెలిపింది. ఆర్కా మీడియా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలందిస్తున్నారు.

ఆ వీడియో ఇదే...

<center><iframe width="100%" height="315" src="//www.youtube.com/embed/JRRJdWzeiKU" frameborder="0" allowfullscreen></iframe></center>

ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం 'బాహుబలి'. రానా ముఖ్యభూమిక పోషిస్తున్నారు. అనుష్క, తమన్నా హీరోయిన్స్. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. కొన్ని నెలలుగా అక్కడ యుద్ధం నేపథ్యంలో కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 2000 మంది కళాకారులపై చిత్రీకరణ జరుపుతున్నారు. ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మిస్తోంది.

Making of Baahubali - A Glimpse Into Our One Year Journey

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకొంది.

English summary
SS Rajamouli tweeted:"We started the journey of Baahubali exactly a year ago. We are releasing a special video today evening, to showcase our journey!"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu