»   » అపార్టమెంట్‌లో నటి రేఖ అనుమానాస్పద మృతి, అంతా షాక్

అపార్టమెంట్‌లో నటి రేఖ అనుమానాస్పద మృతి, అంతా షాక్

Posted By:
Subscribe to Filmibeat Telugu

త్రిసూర్: తమిళ నటి అనుమానాస్పద పరిస్దితుల్లో మరణించిన విషయం మరవక ముందే మరో నటి విషయం వెలుగులోకి వచ్చి ఇండస్ట్రీకి షాక్ ఇచ్చింది. అయితే ఈ సారి మలయాళి నటి రేఖా మోహన్ (45) మృతి చెందారు. ఆమె మృతి కూడా అనుమాన పరిస్దితుల్లోనే ఉండటం అందరినీ ఆలోచనలో,ఆందోళనలో పడేసింది.

Malayalam actor Rekha Mohan found dead in her Thrissur apartment

మలయాళ మీడియా నుంచి వచ్చిన సమాచారం ప్రకారం..నటి రేఖా మోహన్ కేరళ త్రిసూర్ లోని తన అపార్టమెంట్ లోని రేఖా శోభ సిటీ రెసిడెన్స్ ప్లాట్ లో మరణించి ఉంది. రేఖ భర్త ఆమెతో గత రెండు రోజులుగా ఫోన్ చేస్తూంటే ఎత్తటం లేదు. దాంతో ఆయన పోలీసులకు తెలియచేసారు. వెటనే పోలీసులు రంగంలోకి దిగ... తలుపులు బ్రద్దలు కొట్టి చూస్తే అక్కడ మరణించి ఉంది. ఈ విషయం ఆమె భర్తకు తెలియచేసారు. దాంతో పోలీసులు ఆమె కుటుంబ సభ్యులందిరినీ ఈ విషయమై ప్రశ్నిస్తున్నారు.

Malayalam actor Rekha Mohan found dead in her Thrissur apartment

అక్కడ పోలీసులు ఏమని చెప్తున్నారంటే...కేసు రిజిస్టర్ చేసి త్రిసూర్ మెడికల్ కాలేజికి పోస్ట్ మార్టం నిమిత్రం పంపామని అన్నారు. అయితే ఆమె మృతికు కారణమేమిటనేది ఇప్పటికీ తెలియలేదని, రకరకాల అనుమానాలు ఉన్నాయని, ఆ దిశగా ఇన్విస్టిగేషన్ జరుగుతోందని చెప్తున్నారు.అలాగే ఆమె భర్త ఎబ్రాడ్ లో ఉన్నారని, ఫోన్స్ కు ఆమె నుంచి ఏ రెస్పాన్స్ రాకపోవటంతో తాము వెళ్లి తలుపులు బ్రద్దలు కొట్టి ఓపెన్ చేసామని చెప్పారు. ఆ అపార్టమెంట్ కు రెండు రోజుల క్రితం వచ్చింది.

Malayalam actor Rekha Mohan found dead in her Thrissur apartment

రేఖా మోహన్‌ చాలా మలయాళ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటించింది.ముఖ్యంగా ముమ్మట్టితో (ఉదయన్ పాలకన్), మోహన్ లాల్ తో (యాత్రమోజీ) చేసారు.

English summary
A day after the death of a Tamil actor, Malayalam actor Rekha Mohan was reportedly found dead inside her apartment in Thrissur on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu