»   » యంగ్ హీరోకు యాక్సిడెంట్...తలకు తీవ్ర గాయం...సీరియస్

యంగ్ హీరోకు యాక్సిడెంట్...తలకు తీవ్ర గాయం...సీరియస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కొచ్చిన్ : మళయాళం హీరో సిద్దార్ద భరతన్ ... శనివారం (సెప్టెంబర్ 12)న రెండు గంటలకు యాక్సిడెంట్ కు గురి అయ్యారు. ఆయన కొచ్చి చంబక్కర ప్రాంతంలో ఈ యాక్సిడెంట్ చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్ లో ఆయన బాగా గాయపడ్డారు. మనోరమ పత్రికలో ప్రచురింపబడిన దాని ప్రకారం...ఈ నటుడు కారు... రోడ్డు ప్రక్కన ఉన్న బావిని గుద్దుకుంది. దాంతో తలకు తీవ్రంగా గాయాలు అయ్యాయి.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

Malayalam actor Sidharth Bharathan injured in road accident, still critical

ఆయన్ని వెంటనే ఎమ్ .జి రోడ్డు లోని మెడికల్ ట్రస్ట్ హాస్పటల్ కి తీసుకు వెళ్లి జాయిన్ చేసారు. సిద్దార్ద కండీషన్ చాలా సీరియస్ ఉందని హాస్పటిల్ వర్గాలు తెలియచేసాయి. మళయాళ నటీనటులు, దర్శకులు హాస్పటిల్ కు వెళ్లి చూసి వస్తున్నారు.

ఇక సిద్దార్ద మరెవరో కాదు..కమల్ హాసన్ తో క్షత్రియపుత్రుడు చిత్రం డైరక్ట్ చేసిన ప్రముఖ మళయాళ దర్శకుడు భరతన్ కుమారుడు. ప్రముఖ మళయాళి నటుడు జగతి శ్రీకుమార్ మేనకోడలు అంజు దాస్ ని వివాహం చేసుకున్నారు. అయితే వారి వివాహం 2013 లో బీటలు తీసి విడాకులు వరకూ వెళ్లింది. సిద్దార్ద రీసెంట్ గానే దర్శకుడుగా మారారు. ఆయన దిలీప్ హీరోగా రూపొందించిన Chandrettan Evideya చిత్రం మంచి విజయం సాధించింది.

English summary
Malayalam actor Sidharth Bharathan met with an accident on Saturday (September 12) at 2 am, and was critically injured in Chambakkara, Kochi.
Please Wait while comments are loading...