ప్రముఖ మలయాళ నటుడు తిలకన్ మృతి

By Srikanya

Thilakan
కొచ్చిన్ : ప్రముఖ మలయాళ సినీ నటుడు, స్టేజీ ఆర్టిస్టు తిలకన్ ఈ రోజు ఉదయం మరణించారు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన ఆయన ప్రెవేట్ హాస్పటిల్ లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన వయస్సు 77 సంవత్సరాలు. ఆయను ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆగస్టు 23న హార్ట్ ఎటాక్ వచ్చిన ఆయన హాస్పటిల్ లో చేరి మృత్యువుతో పోరాడుతున్నారు. ఆ రోజు నుంచి ఆయనకు వెంటిలేటర్ మీదే కృత్రిమ శ్వాస అందిస్తూ ట్రీట్ మెంట్ అదిస్తున్నారు. ఉదయం 3.35 కు ఆయన మృతి చెందారని డాక్టర్స్ ప్రకటించారు.

తిలకన్ ఇంటర్ మీడియట్ రోజుల నుంచి నటుడుగా తన కెరీర్ ని ప్రారంభించారు. అనేక డ్రామా కంపెనీలతో కలిసి ఆయన ప్రారంభ రోజుల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రో లెప్ట్ కేరల పీపుల్స్ ఆర్ట్ సెంటర్ వంటి ప్రముఖ సంస్ధలలో ఆయన పనిచేసారు. ఆయన కె.జి.జార్జి ఉల్ కడల్ చిత్రం ద్వారా 1979లో సినీ పరిశ్రమలో ప్రవేసించారు. ఆ చిత్రం విజయవంతం కావటం ఆయన పాత్రకు పేరు రావటంతో ఆయన వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేకపోయింది. దాదారు 200 చిత్రాలుకు పైగానే ఆయన నటించారు.

ఆయన అనేక సార్లు జాతీయ అవార్డులు,స్టేట్ అవార్డులు పొందారు. 1988 లో బెస్ట్ సపోర్టింగ్ నటుడుగా నేషనల్ అవార్డు పొంది చాలా మంది ప్రసంసలు పొందారు. అలాగే మూడు సార్లు స్టేట్ అవార్డు పొందిన అరుదైన నటుడు ఆయన. 2009లో పద్మశ్రీ అవార్డుని సైతం పొందారు. ఉస్తాద్ హోటల్ చిత్రం ఆయన నటించిన చివరి చిత్రం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X