»   » మరో హీరోయిన్ కిడ్నాప్‌కు కుట్ర.. నటి భావన కేసులో విచారణలో భయంకర నిజాలు..

మరో హీరోయిన్ కిడ్నాప్‌కు కుట్ర.. నటి భావన కేసులో విచారణలో భయంకర నిజాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మలయాళ నటి భావన కిడ్నాప్ కేసులో భయంకరమైన విషయాలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. సినీ నటి కిడ్నాప్ వ్యవహారంలో కీలక నిందితుడు పల్సర్ సుని పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోతున్నాడు. ఫిబ్రవరిలో చోటుచేసుకొన్న కిడ్నాప్ వ్యవహారానికి సంబంధించిన ఆడియో టేప్ ఒకటి బయటపడటంతో ఈ కేసును కేరళ పోలీసులు తిరగతోడిన సంగతి తెలిసిందే. గత కొద్దిరోజులుగా ఈ కేసులో మలయాళ సూపర్ స్టార్ దిలీప్, దర్శకుడు నాదిర్ షా, పల్సర్ సునీలను విచారిస్తున్నారు.

సునీ చెప్పిన విషయాలతో షాక్

సునీ చెప్పిన విషయాలతో షాక్

పోలీసుల విచారణలో నిందితుడు పల్సర్ సుని చెప్పిన విషయాలు షాక్ గురిచేశాయట. నాలుగేళ్ల క్రితం మరో సినీ నటిని కిడ్నాప్‌కు ప్రయత్నించామని పల్సర్ వెల్లడించినట్టు సమాచారం. కొందరు ఓ సినీ నటిని కిడ్నాప్ చేయాలనే పనిని అప్పగించినట్టు పోలీసులకు సుని తెలిపినట్టు తెలుస్తున్నది. కిడ్నాప్‌కు సంబంధించిన ఫొటోలు ఓ మెమొరీ కార్డులో ఉన్నాయని, అవి నటి కావ్య మాధవన్ షాప్‌లో దాచి పెట్టానని చెప్పాడు. దాంతో ఆమెకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

దిలీప్, నాదిర్ షాతో 13 గంటల విచారణ

దిలీప్, నాదిర్ షాతో 13 గంటల విచారణ

తాజా ఆడియో టేపులు బయటపడిన తర్వాత మరోసారి కేసు విచారణ వేగం పుంజుకొన్నది. నటుడు దిలీప్, దర్శకుడు నాదిర్ షాను దాదాపు 13 గంటలపాటు విచారించారు. కేసు సంబంధించిన సమాచారాన్ని వారి నుంచి అడిగి తెలుసుకొన్నట్టు తెలుస్తున్నది.

పలు కోణాల్లో దర్యాప్తు..

పలు కోణాల్లో దర్యాప్తు..

భావన కిడ్నాప్‌కు సంబంధించిన వ్యవహారంలో పల్సర్ సుని నుంచి దిలీప్ కాల్ వెళ్లిందా? ఆ కాల్‌ను దిలీప్ రిసీవ్ చేసుకొన్నాడా? ఒకవేళ మాట్లాడితే వారి మధ్య సంభాషణ ఏం జరిగింది అనే కోణంలో కేసును విచారిస్తున్నారు.

ఆధారాల కోసం అన్వేషణ

ఆధారాల కోసం అన్వేషణ

భావన కిడ్నాప్ కేసుకు సంబంధించి ఓ ఫిర్యాదు నమోదైంది. ఎఫ్ఐఆర్ గానీ, దానికి సంబంధించిన విచారణ గానీ చేపట్టలేదు. తాజా ఆడియో టేపులు బయటకు రావడంతో ఈ కేసును పున:విచారణ చేపట్టామని కేరళ ఏడీజీపీ బీ సంధ్య చెప్పారు. ఈ వ్యవహారంలో పక్కా ఆధారాలు లభ్యం కాలేదని చెప్పారు.

English summary
Pulsar Suni began to spill the beans on the conspiracy behind the actress's abduction. He allegedly admitted that he was assigned the job of abducting the actress four years ago and began actively plotting the abduction in November. Suni also made claimed that he spoke to Dileep through Nadir Shah and Appunni, the actor's manager. However, police are yet to find evidence of this claim.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu