»   » సమంత కాదు: చైతూ సరసన హాట్ మళయాలం బ్యూటీ!

సమంత కాదు: చైతూ సరసన హాట్ మళయాలం బ్యూటీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాగ చైతన్య, సమంత.... కలిసి నటించిన తొలి సినిమా ‘ఏమాయ చేసేవె'తోనే జెడీ అదిరింది అనిపించారు. ఇద్దరి మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సూపర్బ్. ఆ తర్వాత వీరిద్దరూ నటించిన ‘ఆటో నగర్ సూర్య', ‘మనం' చిత్రాల్లోనే చూడముచ్చటైన జంటగా పేరు తెచ్చుకున్నారు.
 

 Malayalam Actress Manjima Mohan To Romance Naga Chaitanya

త్వరలో గౌతం మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా రాబోయే సినిమాలోనూ సమంతనే తీసుకుంటున్నట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా అందుతున్నసమాచారం ప్రకారం ఈ చిత్రంలో ఆమెను కాకుండా మంజిమ మోహన్ అనే మళయాలం హీరోయిన్ ను తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

గౌతం మీనన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఏమాయ చేసావే' సినిమా తర్వాత చైతన్య కెరీర్ ఒక్కసారిగా పుంజుకుంది. తాజాగా మరోసారి నాగ చైతన్య అతని దర్శకత్వంలో చేస్తుండటం హాట్ టాపిక్ అయింది. మంజిమ మోహన్ ఇప్పటికే పలు మళయాల చిత్రాల్లో నటించింది. తెలుగులో ఆమెకు ఇదే తొలి సినిమా. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
The super-hit pair of Telugu cinema, Samantha and Naga Chaitanya are supposed to romance for the fourth time for a film that is directed by Gautham Menon. However, things took a toll and a new bee grabbed the golden opportunity.
Please Wait while comments are loading...