For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మతులుపోగొడుతున్న మలయాళి భామలు (ఫోటో ఫీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్ : తెలుగు,తమిళ పరిశ్రమలలో హీరోయిన్ అంటే కేరళ నుంచి డౌన్ లోడ్ అన్నట్లు పరిస్దితి తయారైంది. తెలుగు నుంచి ఒకటి అరా హీరోయిన్స్ వచ్చినా నిలబడరు. ఇక ముంబై హీరోయిన్స్ దిక్కనుకుంటన్న టైమ్ లో ఈ మలయాళ బ్యూటీలు వచ్చి అదరకొడుతున్నారు.

  ప్రకృతి సౌందర్యాలను తనలో ఇముడ్చుకున్న కేరళ ఆ అందాలన్నింటినీ తన ఇంటి ఆడపడుచులకు లాంఛనాలుగా ఇస్తోందంటే అతిశయోక్తి కాదేమో అంటున్నారు మన సినిమా వాళ్లు .

  దానికి తగ్గట్లే అక్కడి ముద్దుగుమ్మలు టాలీవుడ్‌లో హవా సాగిస్తున్నారు. పదేళ్లకిందట అడుగుపెట్టిన నయనతార, అసిన్‌ వంటి ముద్దుగుమ్మలు ఇంకా తమ జోరు కొనసాగిస్తుండగా కొత్తగా మరికొందరు దూసుకెళుతున్నారు.

  మరోవైపు తెలుగు హీరోలందరూ కథకళి భామలపైనే కన్నేయడంతో ఎప్పటికప్పుడు కొత్తతారలు ఇక్కడ వాలిపోతున్నారు. నయనతార,అసిన్ తెరపై కాలుమోపి పదేళ్లయినా కాల్షీట్‌ కోసం నేటికీ దర్శకనిర్మాతలు వేచి చూస్తున్నారంటే మన వాళ్ల హృదయంలో ఎంత నాటుకుపోయారో ఇట్టే అర్థమైపోతోంది.

  ఇక్కడ రాజ్యం ఏలుతున్న ఆ భామలపై ఓ స్లైడ్ షో...

  నయనతార

  నయనతార

  'చంద్రముఖి' ద్వారా నయనతారను కేరళ నుంచి దిగుమతి చేసుకున్నారు. అయితే శరత్‌కుమార్‌ సరసన నటించిన 'అయ్యా' ముందుగా విడుదలైంది. నటిగా ఒకింత గుర్తింపు తెచ్చిపెట్టగా ఆ తర్వాత థియేటర్లలోకి వచ్చిన 'చంద్రముఖి' చేతినిండా అవకాశాల్ని తీసుకొచ్చింది. ఆమె కాల్షీట్‌కు డిమాండ్‌ పెరిగింది. అలా ప్రారంభం నుంచే విజయదుంధుభి మోగించిన నయన్‌ ఇప్పటికీ అదేస్థాయిని కొనసాగిస్తోంది.

  అసిన్

  అసిన్

  ఈమె కెరీర్ ఆంధ్ర నుంచి పునాదిరాళ్లు వేసుకుంది. 'అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి'గా వచ్చిన ఈ కేరళ కుట్టి ఆ తర్వాత 'శివమణి', 'లక్ష్మీనరసింహ'తో హ్యాట్రిక్‌ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఇక్కడ కెరీర్‌ తారాపథంలో ఉన్నప్పుడు తమిళంలోకి ప్రవేశించింది. ఇక్కడ ఎర్రతివాచీ స్వాగతం లభించింది. రెండు పరిశ్రమల్లోనూ అవకాశాలు ఉన్నా బాలీవుడ్‌ బాటపట్టింది.

   అమలా పాల్

  అమలా పాల్

  ఇటీవల టాలీవుడ్‌లో అడుగుపెట్టిన అమలాపాల్‌ అగ్రతారల జాబితాలో చేరింది. 'మైనా' (ప్రేమ ఖైదీ) చిత్రం డబ్బింగ్ తో ఇక్కడ పరిచయం అయ్యింది. ఇటీవల రామ్‌చరణ్‌ సరసన తెలుగులో 'నాయక్‌'లో కనిపించిన అమలాపాల్‌ తాజాగా అల్లు అర్జున్‌కు జంటగా 'ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో నటిస్తోంది.

  లక్ష్మి మీనన్

  లక్ష్మి మీనన్

  డబ్బింగ్ చిత్రం గజరాజు తో తెలుగు వారికి పరిచయమైన ముద్దుగుమ్మ లక్ష్మీమీనన్‌. ఆమె ఇప్పుడు సిద్దార్ద సరసన బుక్కైంది. సిద్ధార్థ్‌ హీరోగా 'పిజ్జా' దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు ఓ చిత్రం రూపొందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతుంది. అంతేకాక ఇక్కడ హీరోలు సైతం ఆమె అంటే ఆసక్తి చూపెడుతున్నారు.

  కేథరిన్

  కేథరిన్

  చమ్మక్ ఛల్లో చిత్రంతో తెలుగు కు పరిచయమైన ఈ మళయాళి భామ ..ఇద్దరమ్మాయిలతో, పైసా చిత్రాలు చేస్తోంది. అలాగే మరికొంతమంది పెద్ద బ్యానర్స్ వారు ఆమెను తమ సినిమాలో అడుగుతున్నారు.

  నిత్యా మీనన్

  నిత్యా మీనన్

  అలా మొదలైంది చిత్రంతో పరిచయమైన నిత్యామీనన్ కు తెలుగు నాట విపరీతమైన డిమాండ్. ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే చిత్రాలు సూపర్ హిట్ కావటం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చింది.

  మీరా జాస్మిన్

  మీరా జాస్మిన్

  రన్ చిత్రంలో మాధవన్ ప్రక్కన కనిపించిన మీరా జాస్మిన్ కి ఇక్కడ మంచి డిమాండ్ వచ్చింది. తర్వాత విశాల్ తో చేసిన పందెం కోడి కూడా బాగా ఆడింది. ఇక్కడ పెద్ద హీరోలతో భద్ర వంటి చిత్రాలు చేసింది. తాజాగా ఆమె నటించిన మోక్ష చిత్రం విడుదలకు సిద్దమవుతోంది.

  మమతామోహన్ దాస్

  మమతామోహన్ దాస్

  తెలుగులో యమదొంగ,కేడి వంటి చిత్రాలతో ఒక వెలుగు వెలిగింది మమతా మోహన్ దాస్. వివాహం చేసుకున్నా ఆమె డబ్బింగ్ చిత్రాలు ఒకటీ,అరా పలకరిస్తూ ఆమెను గుర్తు చేస్తూనే ఉంటాయి. అంతేకాదు ఆమె పాటలు కూడా ఫేమసే మరి.

  అవార్డుల కోసం స్థానిక(మలయాళ)చిత్రాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు, ఆర్థికంగా స్థిరపడేందుకు తెలుగు సినిమాలపై దృష్టి పెడుతున్నారు. ఈ కేరళ హీరోయిన్స్ కు సొంతూరులో పేరు ఉన్నా ఇక్కడున్న వసతులు అక్కడ లభించట్లేదని చెబుతున్నారు కొందరు సినీ ప్రముఖులు. ఇక్కడ ఎండ తగలనివ్వకుండా క్యారవ్యాన్‌లో తిప్పుతుంటారు. తెలుగుతో పోల్చితే అక్కడి పరిశ్రమ వ్యాపారపరంగా చాలా చిన్నది. పారితోషికం కూడా రూ.30 లక్షల వరకే ఉంటుందని సమాచారం. ఇక్కడ ఒక్కటి హిట్టయినా ఈ కేరళభామలు పారితోషికాన్ని కోట్లకు పెంచేస్తున్నారు.

  English summary
  In the case of Malayalam girls, they are the perfect package of sexy looks and immense talent. We have seen the likes of Asin, Mamtha Mohandas, Meera Jasmine, Padmapriya and the latest Nithya Menon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X