»   » అసలేం జరుగుతోంది? రజనీకాంత్ ఇంటికి మలేషియా ప్రధాని!

అసలేం జరుగుతోంది? రజనీకాంత్ ఇంటికి మలేషియా ప్రధాని!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కొన్ని రోజులుగా సూపర్ స్టార్ రజనీకాంత్ విషయంలో పలు ఆసక్తికర వార్తలు వినిపించడమే కాదు...ఎవరూ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఇందులో భాగంగా ఏప్రిల్ 2వ తేదిన అభిమానులతో సమావేశం కావాలని నిర్ణయం తీసున్నట్లు వార్తలు వెలువడ్డాయి.

ప్రేక్షకులు, అభిమానులు ఇందుకు సంబంధించి చర్చలో మునిగితేలుతున్న తరుణంలో.... మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ స్వయంగా చెన్నైలోని రజనీకాంత్ ఇంటికి వెళ్లి కలవడం హాట్ టాపిక్ అయింది.

అసలు ఏం జరుగుతోంది? అనే ఉత్కంఠ, ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ పరిణామాలపై స్వయంగా స్వయంగా రజనీకాంత్ మీడియాతో స్పందించారు.

మలేషియా ప్రధానితో సెల్ఫీ

మలేషియా ప్రధానితో సెల్ఫీ

మలేషియా ప్రధాని, రజనీకాంత్ సెల్ఫీ మూమెంట్.

మలేషియా ప్రధాని ఎందుకొచ్చారంటే

మలేషియా ప్రధాని ఎందుకొచ్చారంటే

మలేషియా ప్రధాన మంత్రి నజీబ్ రజాక్ తో భేటీ తర్వాత రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఆయన వచ్చిన కారణాన్ని తెలిపారు. గతంలో తాను మలేషియాలో సినిమా షూటింగులో ఉన్నపుడు నజీబ్ రజానక్ ను కలవలేకపోయానని, ఇపుడు ఆయన ఇండియా పర్యటనలో ఉన్నారు కాబట్టి తనను మర్యాద పూర్వకంగా కలిసేందుకు వచ్చారని తెలిపారు.

మలేషియా బ్రాండ్ అంబాసిడర్ లాంటిదేమీ లేదు

మలేషియా బ్రాండ్ అంబాసిడర్ లాంటిదేమీ లేదు

మలేషియా ప్రధాని రజనీకాంత్ ను తమ దేశ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించాలని నిర్ణయించారని, ఆ విషయం గురించి చర్చించేందుకే ఆయన రజనీకాంత్ ఇంటికి వచ్చారనే ప్రచారాన్ని రజనీకాంత్ ఖండించారు. ఇవన్నీ ఊహాగానాలే అని రజనీకాంత్ తేల్చి చెప్పారు.

అభిమాన సంఘాల మీటింగులో పాల్గొనను

అభిమాన సంఘాల మీటింగులో పాల్గొనను

ఏప్రిల్ 2న జరిగే అభిమాన సంఘాల భేటీలో తాను పాల్గొనడం లేదని రజనీకాంత్ తెలిపారు. ఇది రాజకీయ ఆరంగ్రేటం అనే కారణంతో ఏర్పాటు చేసిన సమావేశం కాదన్నారు. ఏప్రిల్ 11 నుండి 12 వరకు అభిమానులను కలుస్తానని రజనీకాంత్ తెలిపారు.

రోబో 2

రోబో 2

తాను నటిస్తున్న రోబో 2 షూటింగ్ పూర్తయిందని, దీపావళికి ఈ సినిమా రిలీజ్ అవుతుందని రజనీకాంత్ తెలిపారు.

English summary
Millions across the world love Tamil superstar Rajinikanth. However, the veteran actor also has several VIP fans. One is non-other than Malaysian Prime Minister Mohammad Najib Tun Razak. The Malaysian Prime Minister, who is currently in Chennai, met Rajinikanth at his house on Friday. And like a typical fan, Razak took a selfie with Rajinikanth. Talking about his VIP guest, Rajinikanth told reporters, "I was shooting a movie in Malaysia some time ago. I could not meet him then, so I met him now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu