»   » పూనమ్ పాండే..మాలి అండ్ కో ఫస్ట్‌లుక్ (టీజర్)

పూనమ్ పాండే..మాలి అండ్ కో ఫస్ట్‌లుక్ (టీజర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ సెక్స్ బాంబ్ పూనమ్ పాండే త్వరలో ‘మాలిని అండ్ కో' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. ఈ చిత్రంలో ఆమె అందాల విందు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పూనమ్ పాండే ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రానికి వీరు.కె దర్శకుడు. మనీషా ఆర్ట్స్ అండ్ మీడియా పతాకంపై కిషోర్‌రాఠీ సమర్పణలో మహేష్ రాఠీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

చిత్రీకరణ చివరిదశకు చేరుకుంది. ప్రస్తుతం పోరాట ఘట్టాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో చిత్ర టీజర్‌ను దర్శకుడు జి.నాగేశ్వరరెడ్డి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వీరు.కె, నేను ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గర దర్శకత్వ శాఖలో పలు చిత్రాలకు పనిచేశాం. మనీషా సంస్థలో కిషోర్ రాఠీ ఎన్నో విజయవంతమైన చిత్రాలు అందించారని తెలిపారు.

దర్శకుడు వీరు.కె మాట్లాడుతూ ఒక విజయవంతమైన చిత్రంలో వుండాల్సిన అంశాలన్నీ ఇందులో వున్నాయి. పూనమ్ పాండే గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా నటనకు అవకాశమున్న పాత్రలో నటించింది. మిలన్ నటన ఆకట్టుకుంటుంది. బ్యాంకాక్‌లో చిత్రీకరించే ఫైట్‌తో చిత్రీకరణ మొత్తం పూర్తవుతుంది. ఈ నెలాఖరులో ఆడియోను, ఫిబ్రవరిలో చిత్రాన్ని విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నాం అన్నారు. స్లైడ్ షోలో ఫోటోలు, టీజర్.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మాలిని

మాలిని


మాలిని అండ్ కో చిత్రం ద్వారా పూనమ్ పాండే తెలుగు సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇస్తోంది.

కథేంటి?

కథేంటి?


టెర్రరిజం నేపథ్యంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ చిత్రమిది. రెండు అంశాలను మేళవించి వినోదాత్మకంగా తెరకెక్కించామని యూనిట్ సభ్యులు తెలిపారు.

పూనమ్ పాండే

పూనమ్ పాండే


ఈ చిత్రంలో పూనమ్‌పాండే పాత్ర చిత్రణలో భిన్న పార్శాలుంటాయి. ఆమె అందచందాలతో పాటు చక్కటి అభినయంతో ఆకట్టుకోనుందని తెలిపారు.

భిన్నంగా ఉంటుందట..

భిన్నంగా ఉంటుందట..


ఈ చిత్రం రొటీన్‌కి రొటీన్‌కు భిన్నంగా ఉంటుందని చిత్ర యూనిట్ సభ్యులు మీడియా సమావేశంలో తెలిపారు.

ముఖ్యపాత్రల్లో...

ముఖ్యపాత్రల్లో...


ఈ చిత్రంలో పూనమ్ పాండేతో పాటు సామ్రాట్, మిలన్, ఖుషీ, ఫరా, కావ్యాసింగ్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: రాంప్రసాద్, మాటలు: మరుధూరి రాజా.

ఫస్ట్ లుక్ టీజర్

ఫస్ట్ లుక్ టీజర్


మాలిని అండ్ కో ఫస్ట్ లుక్ టీజర్

English summary
Poonam pandey, Samrat, Milian Rati starrer Malini And Co First Look Teaser released.
Please Wait while comments are loading...