»   »  మల్లికా షెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’పై నిషేదం ఎత్తివేత

మల్లికా షెరావత్ ‘డర్టీ పాలిటిక్స్’పై నిషేదం ఎత్తివేత

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద: ప్రముఖ బాలీవుడ్ నటి మల్లికా షెరావత్ తాజాగా నటించిన ‘డర్టీ పాలిటిక్స్' చిత్రంపై నిషేదం ఎత్తి వేసారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయని నిన్న పాట్నా హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ చిత్రం నిషేధం విధించింది. ఈ చిత్రంపై దాఖలైన పిటీషన్ ను విచారించిన కోర్టు సదరు చిత్రంలోని అభ్యంతరకర సన్నివేశాలను తొలగించే వరకు విడుదలను నిలిపి వెయ్యాల్సిందిగా ఆదేశించింది. సీన్లు తొలగించడంతో ఈ బ్యాన్ ఎత్తి వేసారు. యధావిధిగా ఈ చిత్రం మార్చి 6వ తేదీన విడుదలవుతోంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు A సర్టిఫికెట్ ఇచ్చింది.

‘డర్టీ పాలిటిక్స్' సినిమా గురించిన వివరాల్లోకి వెళితే...
రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' ఉదంతం ఆధారంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్‌ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. ఈ చిత్రానికి కెసి. బోకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. రాజకీయ నాయకుడి పాత్రలో ఓంపురి నటిస్తున్నారు.

ఈ చిత్రంలో తన పాత్ర గురించి మల్లిక చెబుతూ...‘తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి ఒక మహిళ జీవితంలో ఎలా ఎదిగింది అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నా పాత్ర పేరు అనోఖి దేవి. తను అనుకున్నది సాధించడానికి ఏం చేయడానికైనా సిద్ధ పడే మహిళ పాత్ర అది' అని మల్లిక చెప్పుకొచ్చింది.

Mallika is back with 'Dirty Politics'

మల్లికా షెరావత్ ఉదంటే....ఆ సినిమాలో ఘాటైన శృంగార సన్నివేశాలు ఉంటాయని ఆశించి వెళతారు. అలాంటి సీన్ల విషయంలో అంతలా పాపుల్ అయింది మల్లికా. అందుకే ఆమెను చాలా మంది సెక్స్ బాంబ్ అని పిలుస్తుంటారు. అలాంటి మల్లికా షెరావత్ ‘డర్టీ పాలిటిక్స్' సినిమాలో శృంగార సన్నివేశాలు చేసేప్పుడు ఇబ్బంది పడిందట.

ఆమె ఇబ్బంది పడటానికి కారణం సీనియర్ నటుడు ఓంపురితో కలిసి ఆ సీన్లు చేయాల్సి రావడమే. ఈ విషయాన్ని మల్లికా షెరావత్ స్వయంగా వెల్లడించారు. ఓంపురిగారు నాకంటే పెద్ద వారు. ఆయనతో అలాంటి సీన్లు చేసేప్పుడు కాస్త ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో ఆయన ఎంతో సపోర్టు ఇచ్చారు అని మల్లిక చెప్పుకొచ్చింది.

తన క్యారెక్టర్ గురించి మరింత లోతుగా చెబుతూ...‘ఆమె ఒక పేద కుటుంబం నుండి వస్తుంది. ఒక రాజకీయ నాయకుడు ఆమెను మోహిస్తాడు. అదే అదునుగా ఆమె తన సెక్స్ అప్పీల్ ఉపయోగించి అతని వశం చేసుకుని తాను అనుకున్నది సాధించడానికి ఏం చేసింది' అనేది డర్టీ పాలిటిక్స్ సినిమా అని తెలిపారు.

English summary
Trapped in a series of controversies, including a release ban, Mallika Sherawat's latest movie “Dirty Politics" got respite today. Yesterday, Patna high court has ordered to stall the release of this flick as a petition sought intervention of court to stop the screening of explicit scenes and cuss words in this film to public. Today, the ban is lifted by the court and way is cleared for release.
Please Wait while comments are loading...