మల్లిక షెరావత్ క్షమాపణలు చెప్పాలంటూ కోర్టు ఆదేశం
ముంబై: జాతీయ జెండాను అవమానించారని సినీనటి మల్లికాశెరావత్‌పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ జెండాను మల్లికా ఒంటికి చుట్టుకుని అవమానపరిచారంటూ న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు షెరావత్ వారంలోగా రాతపూర్వక క్షమాపణ చెప్పాలని ఆదేశాలు జారీ చేసింది.
మల్లికా షెరావత్ నటించిన ‘డర్టీ పాలిటిక్స్' ఫస్ట్ లుక్ పోస్టర్ లో జాతీయ పతాకాన్ని అవమానించే విధంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్ లో మల్లిక షెరావత్ ఒక అంబాసిడర్ కారుపై అభ్యంతరకరంగా త్రివర్ణ పతాకాన్ని ధరించి ఉన్నట్లుగా రూపొందించారు.

మువ్వన్నెల జెండాను వ్యాపార పరంగా వినియోగించడం దేశ గౌరవాన్ని అవమానించినట్లేనని అభిప్రాయ పడ్డారు.


Click it and Unblock the Notifications











