»   » గోడకు పిడకలు కొట్టుకుంటూ మల్లికా షెరావత్

గోడకు పిడకలు కొట్టుకుంటూ మల్లికా షెరావత్

Posted By:
Subscribe to Filmibeat Telugu
ముంబై: రాజస్థాన్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన 'భన్వరీదేవి' జీవితం ఆధారంగా నిర్మిస్తున్న ఒక సినిమాలో శృంగార నటి మల్లికా షెరావత్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. వెండి తెరపై శృంగారాన్ని ఒలికించిన మల్లికా శెరావత్‌ ఈ చిత్రంలో పల్లెటూరు పడుచుగా కనిపించబోతోంది. గ్లామర్‌కి ఆస్కారం లేని పాత్రలో పిడకలు చేసుకొంటూ కెమెరా ముందు నటిస్తోంది.

ఇక ఈ చిత్రం టైటిల్ 'డర్టీ పాలిటిక్స్‌'. రాజస్థాన్‌లో రెండేళ్ల కిందట వెలుగుచూసిన భన్వరీదేవి ఉదంతం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. కె.సి.బొకాడియా దర్శకత్వం వహిస్తున్నారు. పల్లెటూరికి చెందిన గృహిణిగా మల్లిక పాత్ర ఉంటుంది. కొందరు రాజకీయ నాయకుల మూలంగా ఆమె జీవితం ఎలా ఇబ్బందులు పాలైందో చూపించబోతున్నారు.


ఇక ఈ చిత్రం ప్రారంభమైందని తెలిసి ఒక రాజకీయ పార్టీకి నేతలు ఇండోర్‌ నగరంలోని షూటింగ్‌ స్పాట్‌కి వచ్చి అభ్యంతరం వ్యక్తం చేశారట. ఈ పరిణామంతో దర్శకుడు కె సి బొకాడియా మొత్తం సినిమా ట్రాక్‌నే మార్చేశారని సమాచారం.

తాజా మార్పుల ప్రకారం ఈ సినిమాలో మల్లిక పేరు భన్వరీదేవి కాదని, ఆ పాత్రపేరు అనోఖీ దేవి అని చెబుతున్నారు. భన్వరీ దేవి నర్స్‌ కాగా, ఈ సినిమాలో మల్లిక పాత్ర వేరని బొకాడియా అంటున్నారు. జనం ఏవేవో ఊహించుకుని ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

అనోఖీదేవిగా కనిపించే మల్లిక ఇందులో ఒక నర్తకిగా ఆ పాత్ర అవసరాల మేరకు ఎంత మేరకైనా నటిస్తుందని దర్శకుడు చెబుతూ ఐటెం సాంగ్‌ కూడా ఉండవచ్చనే సంకేతాలిచ్చారు. ఈ పరిణామానికి ముందు వీరిద్దరూ మల్లిక పాత్రతో ముడిపడిన నిజజీవిత ఘటనల గురించే ఎక్కువగా మాట్లాడుతూ వచ్చారు. ఈ చిత్రంలో ఓమ్‌పురి, అనుపమ్‌ఖేర్‌, జాకీ ష్రాఫ్‌, అశుతోష్‌రాణా తదితరులు నటిస్తున్నారు.

English summary
Mallika Sherawat will be seen in a film titled ‘Dirty Politics’, where she will be playing a character based on the true story of a nurse Bhanwari Devi, a gang rape victim. The film also stars veteran actors like Anupam Kher, Ashutosh Rana, Jackie Shroff and Om Puri.
Please Wait while comments are loading...