twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మల్లికా శరావత్ లేటెస్ట్ 'హిస్‌స్‌స్‌' చిత్రం హిట్టా..ఫట్టా?

    By Srikanya
    |

    మెళ్ళో పాములను దిగేసుకుని ఫోజిలిచ్చి మరీ పబ్లిసిటీ చేసి, చాలా కాలంగా వార్తల్లో నిలిచిన సెక్స్ బాంబ్ మల్లికా శరావత్ 'హిస్‌స్‌స్‌' చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం ధియోటర్లోకి దిగింది. అయితే సినిమాలో ప్రేక్షకులు ఆశించే విషయం లేక 'హిస్‌స్‌స్‌' కాస్తా 'తుస్‌స్‌స్‌' గా మారింది. జెన్నిఫర్‌ లించ్‌ దర్సకత్వంలో వచ్చిన ఈ చిత్రం చూసిన వారికి ఓ పీడకల అనుభూతిని ఇచ్చింది. మల్లికా శరావత్ ని బోల్డ్ గా చూపటం తప్ప ఈ చిత్రంలో ఓ కథ, స్క్రీన్ ప్లే, పాటలు, నటన, దర్శక విలువలు ఏమీ కనపడవు.

    ఇంతకీ ఈ చిత్రం కథ..మన భారతీయులంతా..నాగు పాముని దైవంలా భావించి పూజిస్తూంటాం. అలాగే పిల్లలు పుట్టాలన్నా పాము పూజలు తప్పని సరి. అందులోనూ సింధూనది తీరంలో నివసించే వారికి ఈ నమ్మకాలు మరీ ఎక్కువ అనే వాయిస్ ఓవర్ తో చిత్రం ప్రారంభమవుతుంది. సింధూనది తీరంలో సగం మనిషి, సగం పాము శరీరం కలిగిన జీవులు సంచరించేవారని అక్కడ ప్రచారంలో ఉందని ఎస్టాబ్లిష్ చేస్తారు. అలాటి వాటిలో మల్లికా శరావత్ ఓ ఇచ్చా నాగు('కోర్కెలు తీర్చే నాగ కన్య') ఒకతె.

    ఇవన్నీ విన్న జార్జి అనే విదేశీయుడు...2008లో ఈ నమ్మకాలను మూఢ నమ్మకాలుగా కొట్టిపారేస్తూ...అది నిరూపించాలని, మలబార్ దీవుల్లోకి వచ్చి తనకు ఎదురైన ఓ మగపాముని క్రూరంగా చంపేస్తాడు. ఆ సమయంలో ఆ మగపాము, మరో ఆడపాముతో సంగమంతో ఉంటుంది. ఈ సంఘటనతో ఆగ్రహించిన నాగదేవత (మల్లికా) అతడిని మట్టుపెట్టాలని కంకణం కట్టుకుంటుంది. ఆమె దారికి అడ్డువచ్చే వారెవారైనా సరే..పాము కాటుకు గురవుతారు.

    నాగదేవత అడ్డువచ్చిన వారిని అమాంతం మింగి చంపేస్తుంటుంది. అప్పుడు ఈ అంతుబట్టని హత్యలను దర్యాప్తు చేసే భాధ్యతను డిటెక్టివ్ (ఇర్ఫాన్‌ ఖాన్)‌ కి అప్పచెప్తారు. అప్పుడు ఏమి జరిగింది. నాగుపాము తన పగని ఎట్లా తీర్చుకుంది అనేది మిగతా కథ. ఇక ఈ 'హిస్‌స్‌స్‌' చిత్రం ఎవరికి నచ్చే అవకాశం ఉందంటే..మల్లికా అందచందాలతో హారర్‌ చిత్రాన్ని చూడాలనుకునేవారికి మాత్రమే నచ్చుతుంది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X