»   » ఒప్పేసుకుంది: మల్లికా షెరావత్ లవర్ ఇతడే (ఫోటో)

ఒప్పేసుకుంది: మల్లికా షెరావత్ లవర్ ఇతడే (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలీవుడ్ హాట్ బ్యూటీ మల్లికా షెరావత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదకుంటా. బాలీవుడ్ సెక్స్ బాంబ్ గా, ఐటం గర్ల్ గా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న మల్లికా ప్రస్తుతం ఎక్కువగా విదేశాల్లోనే గడుపుతోంది. కారణం ఏమిటా అని ఆరా తీస్తే అమ్మడు ఓ విదేశీ వ్యాపార వేత్తతో ప్రేమ వ్యవహారంలో బిజీగా ఉందని తేలిసింది.

 Mallika Sherawat in love

పారిస్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సైరిల్లే ఆక్సన్‌ఫ్యాన్స్ అనే వ్యక్తితో అమ్మడు ప్రేమ వ్యవహారం నడుపుతోందంటూ..... ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక వార్తను పబ్లిష్ చేయగా.... అవును నిజమే, నేను అతనితో ప్రేమలో ఉన్నాను అంటూ ట్విట్టర్ ద్వారా ఖరారు చేసింది మల్లికా.

'ఈ ప్రపంచంలో ప్రేమను మించిన గొప్ప ఫీలింగ లేదు. ప్రస్తుతం నేను ఆ ఫీలింగును చాలా ఎంజాయ్ చేస్తున్నాను' అంటూ ట్వీట్ చేసింది మల్లిక. మల్లిక బాయ్ ఫ్రెండ్ బాగా బలిసిన పార్టీ కావడంతో ఆమెను ఎంతో బాగా చూసుకుంటున్నాడు. ప్రత్యేక విమానంలో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ, అత్యంత ఖరీదైన హోటళ్లలో బస చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న సర్వ సుఖాలు జంటగా ఆస్వాదిస్తున్నారు.

సైరిల్లే కూడా మల్లిక షెరావత్ అందానికి దాసోహం అయిపోయాడు. ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు. రోజుకో సర్ ప్రైజ్ ఇస్తూ ఆమె ప్రతి క్షణం ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నాడు. మరి వీరి ప్రేమ బంధం పెళ్లి వరకు వెలుతుందా? లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

English summary
Actress Mallika Sherawat has been dating Paris-based real estate businessman Cyrille Auxenfans for a while now. The couple, who was introduced to each other through common friends, is said to be madly in love.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu