»   » సొంతూర్లో మల్లికా షెరావత్, ఫ్యాన్స్‌పై లాఠీ చార్జ్ (ఫోటోలు)

సొంతూర్లో మల్లికా షెరావత్, ఫ్యాన్స్‌పై లాఠీ చార్జ్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మర్డర్ సినిమా ద్వారా వెలుగులోకి వచ్చిన తార మల్లికా శరావత్. ఆ సినిమాలో మల్లికా అందాల ప్రదర్శన, ఘాటైన ముద్దు సీన్లు ఆమెకు ఎనలేని క్రేజ్ తేవడమే కాదు, అనతి కాలంలో ఊహించని పాపులారిటీ సంపాదించింది. ఆ సినిమా తర్వాత ఆమె కెరీర్ గ్రాఫ్ భాగానే సాగినా ప్రస్తుతం మాత్రం ఏమంత సంతృప్తి కరంగా లేదు.

ఈ నేపధ్యంలో ఆమె టీవీ వైపు మ్రొగ్గు చూపిస్తోంది. బుల్లితెరపై రియాల్టీ షో చేస్తోంది. ''ది బ్యాచిలరెట్ ఇండియా - మేరే ఖయాలో కీ మల్లికా'' అనే రియాల్టీ టివి షోతో ద్వారా తన కలల రాకుమారుడు మిస్టర్ రైట్ కోసం అన్వేషణ సాగిస్తోంది. ఈ కార్యక్రమం షూటింగులో భాగంగా మల్లికా షెరావత్ హర్యానాలోని తన సొంతూరుకు వచ్చింది.

హీరోయిన్ అయిన తర్వాత తొలిసారిగా ఇక్కడికి వచ్చిన ఆమెను చూసేందుకు అభిమానులు పోటెత్తారు. బెల్లం చుట్టు ఈగలు ముసినట్లుగా ఆమె కారు చుట్టూ వేలాది మంది చేరారు. ఈ పరిస్థితి ముందే ఊహించిన పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేసారు. అయితే ఊహించన దానికంటే ఎక్కువ మంది అభిమానులు రావడంతో పోలీసులు అదుపు చేయలేక పోయారు. వారిని అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేసారు.

ఈ విషయాన్ని మల్లిక తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. హర్యానాలోని సొంతూరుకు వెళ్లాను. కారు నుండి కాలు బయట పెట్టలేక పోయాను. అంటూ వెల్లడించారు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్లైడ్ షోలో...

సొంతూర్లో మల్లికా షెరావత్

సొంతూర్లో మల్లికా షెరావత్

హర్యానాలోని తన సొంతూరుకు మళ్లికా షెరావత్ కార్లో వస్తున్న దృశ్యం.

భారీగా జనం

భారీగా జనం

మల్లికా షెరావత్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో జనం గుమిగూడారు.

బెల్లం చుట్టూ ఈగలు

బెల్లం చుట్టూ ఈగలు

బుల్లం చుట్టూ ఈగలు ముసిరినట్లుగా మల్లికా షెరావత్ చుట్టూ జనాలు గుమిగూడారు.

మల్లిక ఆశ్చర్యం

మల్లిక ఆశ్చర్యం

తనను చూసేందుకు భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో మల్లికా షెరావత్ ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆందోళన..

ఆందోళన..

అయితే భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో పరిస్థితి కాస్త ఆందోలన కరంగా మారింది.

పోలీసులు

పోలీసులు

మల్లిక వస్తున్న విషయం తెలిసి పోలీసులు భారీ సంఖ్యలో మెహరించారు.

లాఠీ చార్జ్

లాఠీ చార్జ్

పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అభిమానులపై లాఠీలు ఝులిపించారు.

English summary
Bollywood star Mallika Sherwat, who has already made news for her atrocious comments about India being a 'regressive' nation , decided to go back to her roots as she paid a visit to her hometown in Haryana. Thousands of fans stormed outside the star’s car to get a view of her.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu