»   »  తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరో వారసుడు... పేరు సత్య ప్రభాస్

తెలుగు సినీ ఇండస్ట్రీలోకి మరో వారసుడు... పేరు సత్య ప్రభాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీరంగంలోకి వారసుల రాక కొనసాగుతూనే ఉంది. దాదాపుగా ఇపుడు తెలుగు సినిమా రంగంలో ఎక్కువగా వారసులే ఉన్నారు. ఇదే క్రమంలో మరొకరు ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అతని పేరు సత్య ప్రభాస్. కొంపతీసి హీరో ప్రభాస్ చుట్టం అని మాత్రం అనుకోవద్దు.

Malupu Theatrical Trailer

ఒకప్పుడు చంటి, పెదరాయుడు, యముడికి మొగుడు లాంటి హిట్ చిత్రాలను అందించిన ప్రముఖ దర్శకుడు రవి రాజా పనిశెట్టి తనయుడే ఈ సత్య ప్రభాస్. ఇప్పటికే ఆయన పెద్ద కొడుకు ఆది పనిశెట్టి ఇటు తెలుగు, అటు తమిళం సినిమాల్లో రాణిస్తున్నాడు. అయితే సత్య ప్రభాస్ సోదరుడిలా నటుడిగా కాకుండా.... తండ్రి మాదిరి దర్శకుడిగా రాణించాలని నిర్ణయించుకున్నాడు.

అమెరికన్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో దర్శకత్వ శాఖలో కోర్సు చేసిన సత్య ప్రభాస్.... స్టూడెంట్ గా ఉన్నపుడు షార్ట్ ఫిల్మ్స్ తీసి అవార్డులు సొంతం చేసుకున్నాడు. దర్శకత్వ శాఖలో పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన తర్వాత దర్శకుడిగా ఎంటరీ ఇచ్చారు.

తాజాగా ‘మలుపు' అనే చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. త్వరలో ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సత్య ప్రభాస్ సోదరుడు ఆది పనిశెట్టి, నిక్కి గల్‌రాణి, మిథున్ చక్రవర్తి, నాసర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది.

English summary
Malupu Theatrical Trailer featuring Aadhi Pinisetty, Nikki Galrani, Mithun Chakraborty, Nasser. Directed by Sathya Prabhas Pinisetty, Produced by Ravi Raja Pinisetty, Music by Prasan, Praveen & Shyam. The movie also stars Richa Pallod, Pasupathy, Pragati among others.
Please Wait while comments are loading...