»   »  ‘మామ మంచు- అల్లుడు కంచు’ అడియో రిలీజ్ డేట్

‘మామ మంచు- అల్లుడు కంచు’ అడియో రిలీజ్ డేట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు, అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు'. డా. మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ, మీనా నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు జతగా పూర్ణ నటిస్తుంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. అచ్చు సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని నవంబర్ 28న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు. అలాగే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల చేయనున్నారు.

Mama Manchu Alludu Kanchu audio release date

ఈ సందర్భంగా... నిర్మాత మంచు విష్ణు మాట్లాడుతూ ‘'నాన్నగారు నటిస్తున్న‘మామమంచు- అల్లుడు కంచు' సినిమా ఆయన హీరోగా నటించిన 181వ చిత్రం. అలాగే ఈ చిత్రంలో అల్లరి నరేష్,పూర్ణ నటిస్తున్నారు. అల్లరి నరేష్ కు ఈ చిత్రం 50వ సినిమా. డిఫరెంట్ కాంబినేషన్ లో అవుటండ్ అవుంట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటుంది. అచ్చు మంచి మ్యూజిక్ ను అందించారు. నవంబర్ 28న ప్రముఖుల సమక్షంలో ఈ చిత్ర ఆడియో కార్యక్రమాన్నినిర్వహించనున్నాం. డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సినిమాను చక్కగా డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా బాగా వచ్చింది. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేస్తున్నాం'' అన్నారు.

డా.మోహన్ బాబు, నరేష్, రమ్యకృష్ణ, మీనా, పూర్ణ, వరుణ్ సందేశ్, అలీ, కృష్ణభగవాన్, జీవా, రాజా రవీంద్ర, సోనియా,సురేఖా వాణి, హృదయ, మౌనిక, ధనరాజ్, చమ్మక్ చంద్ర , ఖయ్యూమ్, సాయి పంపాన, చిట్టిబాబు, అనంత్, సత్తెన్న,దాసన్న, అంబటి శీను ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీదర్ సీపాన, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత్ శ్రీరామ్, శ్రీమణి, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, శ్రీధర్,విద్యాసాగర్, ఆర్ట్: చిన్నా, ఎడిటర్: గౌతంరాజు, సినిమాటోగ్రఫీ: బాలమురుగన్, సంగీతం: అచ్చు, రఘకుంచె, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్, సమర్పణ: అరియానా, వివియానా, విధ్యానిర్వాణ, నిర్మాత: విష్ణు మంచు, స్ర్కీన్ ప్లే,దర్శకత్వం: శ్రీనివాస రెడ్డి.

English summary
The audio launch of Mohan Babu and Allari Naresh starrer Mama Manchu Alludu Kanchu is going to be held on 28th of November in Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu