»   » 11-11-11న ఆ తెలుగు హీరోయిన్ నిశ్చితార్థం

11-11-11న ఆ తెలుగు హీరోయిన్ నిశ్చితార్థం

Posted By:
Subscribe to Filmibeat Telugu

తెలుగులో యమదొంగ,విక్టరీ,కేడీ వంటి సినిమాలు చేసి పేడవుట్ అయిపోయిన మళయాళి ముద్దుగుమ్మ మమతా మోహన్ దాస్. ఆమె ఇక వేషాలు రావనో లేక లైఫ్ లో సెటిల్ అవ్వాలనో ఫిక్స్ అయ్యి పెళ్లికి రెడీ అయ్యింది.అతనో బిజినెస్ మ్యాన్. నవంబర్ 11న కేరళలోని కోచ్చిలో మమతా నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది వివాహం జరుగుతుంది.ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...గత కొన్నేళ్లుగా నేను ఓ బిజినెస్‌మాన్‌ని డేటింగ్ చేస్తున్నా. మా స్నేహం ప్రేమగా మారింది. అసలు మేము స్నేహితులమనే అనుకున్నాం. అయితే ఏళ్లు గడిచే కొద్దీ మా మధ్య స్నేహంకన్నా ఎక్కువ ఇంకేదో ఉందని, అదే ప్రేమ అని తెలుసుకున్నాం. మా ప్రేమను మా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. వాస్తవానికి తను బహ్రెయిన్‌లో ఉంటాడు. షూటింగ్స్ నుంచి ఖాళీ దొరికితే చాలు మా నాన్నతో స్పెండ్ చేయడానికి నేను బహ్రెయిన్ వెళుతుంటాను. మా నాన్న అక్కడ ఒక అమెరికా బేస్డ్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. మా అమ్మ ఎక్కువగా నాతో షూటింగ్స్‌కు హాజరయ్యేవారు. ఖాళీ దొరికినప్పుడు నేను, మా అమ్మ బహ్రెయిన్ వెళ్లేవాళ్లం. ఆ సమయంలో ఆ అబ్బాయిని కలుసుకునేదాన్ని. మా మధ్య బాగా అవగాహన కుదిరింది. తనే నా మిస్టర్ రైట్ అనిపించింది అన్నారు. ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ తడయార తాక్క అనే తమిళ చిత్రంలోను, మలయాళంలో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఒప్పుకున్న సినిమాలు ఏప్రిల్ వరకు షూటింగ్స్ జరుగుతాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి పరిమితం కానుంది.

English summary
Actress Mamta Mohandas is going to get engaged with her childhood friend on 11th November this year, so the engagement date is 11/11/11 (a fancy date). Mamta’s mother confirmed the news recently to the media and said will reveal more details about the groom at the time of her daughter’s engagement.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu