»   » కేడీ చేస్తున్నప్పుడే ఆరోగ్యం దెబ్బతిని బరువు పెరిగా: మమతామోహన్ దాస్

కేడీ చేస్తున్నప్పుడే ఆరోగ్యం దెబ్బతిని బరువు పెరిగా: మమతామోహన్ దాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Mamata Mohandas
కేడీ సినిమా చేస్తున్నప్పుడే ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి. ఈ కారణంగా కొంచెం బరువు కూడా పెరిగాను. కానీ కేడి లో ఒక బిడ్డకు తల్లిగా యాక్ట్ చేశాను కాబట్టి బరువు పెరిగినా ఎబ్బెట్టుగా అనిపించలేదు. అయితే ఆరోగ్యపరమైన అవాంతరాలను ఎదుర్కొని బయటపడ్డాను. దాంతో ఎప్పటిలానే స్లిమ్‌గా, ట్రిమ్‌గా ఉండటానికి వర్కవుట్లు చేసి బరువు తగ్గాను. మంచి పాత్రలొస్తే ఈ ఏడాది తెలుగు సినిమాలు కూడా చేస్తాను అంటోంది మళయాళ బ్యూటీ మమతా మోహన్ దాస్. నాగార్జున సరసన కేడీ చిత్రం చేస్తున్నప్పుడు ఆమె కాన్సర్ బారిన పడి, బయిటపడ్డారు.

అలాగే గడిచిన సంవత్సరం గురించి చెబుతూ...గ్రేట్ ఇయర్ 2010. మలయాళంలో నేను చేసిన ఐదు సినిమాలు విడుదలై మంచి టాక్ తెచ్చుకున్నాయి. ఇంకో సినిమా ఈ శుక్రవారం విడుదలైంది. అలాగే ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా మలయాళంలో కొన్ని పాటలు పాడాను. 2010 చాలా బిజీ బిజీగా గడిచింది. 2011 నాకు మూడు అవార్డులతో ఆరంభం అవుతోంది. గత ఏడాది చేసిన సినిమాల్లో కొన్నింటికి ఉత్తమ నటిగా కేరళలో అవార్డ్ అందుకోబోతున్నాను. చాలా ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu