For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కాన్సర్ తో ధైర్యంగా పోరాడి గెలిచానంటోంది

  By Srikanya
  |

  ఓ నటిగా నా సంపాదన లక్షల్లో ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాం. ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటున్నాం. మనకే రోగం రాదని అనుకునేదాన్ని. కానీ ప్రకృతి ముందు అందరూ ఒకటేనని కాన్సర్ సోకిన తర్వాత గ్రహించాను. అయితే ఒక్కటి మాత్రం నిజం.అనారోగ్యానికి గురైన తర్వాత అధైర్యపడితే కోలుకోవడం కష్టం. హార్ట్ ఎటాక్, బ్లడ్‌ప్రెషర్, షుగర్‌లా కేన్సర్ కూడా ఓ వ్యాధి. కానీ కేన్సర్‌ని ఓ భూతంలా చూస్తారు.. భయపడతారు. తగిన సమయంలో చికిత్స చేయించుకుంటే.. నాలా సంపూర్ణ ఆరోగ్యవంతులవ్వొచ్చు అంటూ ధైర్యం చెబుతోంది మమతా మోహన్ దాస్. ఆమెకు కొంత కాలం క్రితం కాన్సర్ సోకింది. కానీ ధైర్యంతో పోరాడి గెలిచింది. కేన్సర్‌కి సంబంధించిన చికిత్స చేయించుకున్నప్పుడు మమతా శరీరాకృతిలో మార్పు రావడంతోపాటు జుత్తు కూడా బాగా రాలిపోయింది. అందుకే ఆమె తన జుత్తుని కురచగా కత్తిరించుకున్నారు. అలాగే ఇక తను ఎప్పటి మమతాలా ఉండలేనని, సినిమా కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్లేనని మమతా భావించారట. కానీ ఎక్కడో ఓ మూల నమ్మకం ఉండబట్టి ధైర్యంగా చికిత్స చేయించుకుని, ఆమె కేన్సర్‌ని జయించగలిగాను అంటోంది. కాన్సర్ రోగులకు ధైర్యం చెబుతోంది. ప్రస్తుతం ఆమె తమిళంలో తడయర తాక్క అనే చిత్రంలో నటిస్తున్నారు. మలయాళంలో రెండు, మూడు చిత్రాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఈ నవంబర్‌లో బహ్రెయిన్‌కి చెందిన వ్యాపారవేత్తతో మమతా నిశ్చితార్థం జరగనుంది.

  నవంబర్ 11న కేరళలోని కోచ్చిలో మమతా నిశ్చితార్థం జరగనుంది. వచ్చే ఏడాది వివాహం జరుగుతుంది. ఈ విషయమై ఆమె మాట్లాడుతూ...గత కొన్నేళ్లుగా నేను ఓ బిజినెస్‌మాన్‌ని డేటింగ్ చేస్తున్నా. మా స్నేహం ప్రేమగా మారింది. అసలు మేము స్నేహితులమనే అనుకున్నాం. అయితే ఏళ్లు గడిచే కొద్దీ మా మధ్య స్నేహంకన్నా ఎక్కువ ఇంకేదో ఉందని, అదే ప్రేమ అని తెలుసుకున్నాం. మా ప్రేమను మా కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. వాస్తవానికి తను బహ్రెయిన్‌లో ఉంటాడు. షూటింగ్స్ నుంచి ఖాళీ దొరికితే చాలు మా నాన్నతో స్పెండ్ చేయడానికి నేను బహ్రెయిన్ వెళుతుంటాను. మా నాన్న అక్కడ ఒక అమెరికా బేస్డ్ బ్యాంకులో జాబ్ చేస్తున్నారు. మా అమ్మ ఎక్కువగా నాతో షూటింగ్స్‌కు హాజరయ్యేవారు. ఖాళీ దొరికినప్పుడు నేను, మా అమ్మ బహ్రెయిన్ వెళ్లేవాళ్లం. ఆ సమయంలో ఆ అబ్బాయిని కలుసుకునేదాన్ని. మా మధ్య బాగా అవగాహన కుదిరింది. తనే నా మిస్టర్ రైట్ అనిపించింది అన్నారు. ప్రస్తుతం మమతా మోహన్‌దాస్ తడయార తాక్క అనే తమిళ చిత్రంలోను, మలయాళంలో మూడు చిత్రాల్లోనూ నటిస్తున్నారు. ఒప్పుకున్న సినిమాలు ఏప్రిల్ వరకు షూటింగ్స్ జరుగుతాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకుని కుటుంబ జీవితానికి పరిమితం కానుంది.

  English summary
  Mamatha talks about her movies, and determination in fighting Hodgkin's Lymphoma.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X