»   » నా నంది తెలంగాణాకు అంకితం

నా నంది తెలంగాణాకు అంకితం

Posted By:
Subscribe to Filmibeat Telugu

మామిడి హరికృష్ణ వరంగల్ జిల్లా శాయంపేట గ్రామంలో జన్మించి అక్కడే పదవ తరగతి వరకు విద్యను అభ్యసించాడు. ఇంటర్మీడియట్, డిగ్రీ వరంగల్‌లోని లాల్ బహదూర్ కళాశాలలో చదివి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎ (సైకాలజీ), కాకతీయ విశ్వవిద్యాలయంలో మాస్టర్ డిగ్రీ అందుకున్నాడు. తెలంగాణ పుట్టి పెరగడం ద్వారా తెలంగాణ భాష, తెలంగాణ సంస్కృతి పట్ల అపారమైన మక్కువతో తెలంగాణ మాండలికంలో వివిధ పత్రికలకు వ్యాసాలు, కవర్ స్టోరీలు రాసి, సినీ విశ్లేషకులుగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా రాష్ట్ర ప్రభుత్వ నంది బహుమతులు పొందాడు.

నంది బహుమతుల జ్యూరీ సభ్యుడిగా కూడా పనిచేశాడు. తెలంగాణ కవితలను ఆంగ్లంలోకి అనువదించి తెలంగాణ కవితలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చారు. కవిగా, సినీ విశ్లేషకుడిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్‌గా, పెయింటర్‌గా, తెలంగాణ చరిత్ర పరిశోధకుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ప్రశంసలు అందుకున్న ఆయన. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వచ్చిన ఈ నంది అవార్డు ని తెలంగాణాకే అంకితమిస్తూ ప్రకటణ చేయటం పై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు అంకిత ప్రకటన ఆయన మాటల్లోనే....

Mamidi Harikrishna Dedicates His Nandi to Telangana

''ఉత్తమ సినీ విమర్శకునిగా అవార్డు ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది నాకు రెండో నంది అవార్డు. 2009లో అందుకున్న అవార్డును అమ్మకు అంకితమిచ్చాను. ఇప్పుడు ప్రకటించిన అవార్డును తెలంగాణకు అంకితమిస్తున్నాను. తెలుగు సినిమా అంశాల్ని స్పృశిస్తూనే వరల్డ్‌ సినిమాను పాఠకులకు పరిచయం చేయడం ఉద్దేశంగా పెట్టుకొని సినిమా వ్యాసాలు రాశాను. హిందీ సినిమా నీడలో ఎలాగైతే మరాఠీ సినిమా ఎదిగిందో, అలాగే తెలుగు సినిమా నీడలో ఉన్న తెలంగాణ సినిమా ఎదిగేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకునిగా నా వంతు కృషి చేస్తున్నా.

నేను సినిమాను సంస్కృతిలో ఒక భాగంగా పరిగణిస్తాను. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ తరపున రెండేళ్లుగా బతుకమ్మ ఫిల్మోత్సవం నిర్వహిస్తూ ఔత్సాహిక సినిమా రూపకర్తల్ని ప్రోత్సహిస్తున్నాం. 2015లో ఆ ఫిల్మోత్సవంలో 'సైన్మా' అనే షార్ట్‌ ఫిల్మ్‌ను ప్రదర్శించాం. ఆ తర్వాత ఏడాదికే దాని దర్శకుడు ఓ చక్కని సినిమా తీసి, అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ దర్శకుడు తరుణ్‌ భాస్కర్‌.. ఆ సినిమా 'పెళ్లిచూపులు'." అంటూ ఆయన చేసిన ప్రకటన తెలంగాణా ప్రాతీయ సినీ అభిమాను మరింతగా ఉత్సాహ పరిచేలా ఉంది.

English summary
Director of Culture Mamidi Harikrishna Dedicates His Nandi Award to Telangana
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu