»   » స్టార్ హీరో కారు యాక్సిడెంట్..సేప్

స్టార్ హీరో కారు యాక్సిడెంట్..సేప్

Posted By:
Subscribe to Filmibeat Telugu

మళయాళి సూపర్ స్టార్ మమ్ముట్టి వెళ్తున్న కారుని ఓ బస్ గుద్దేసింది.అయితే కారు పాడయినా అందులోని వారు సేఫ్ గా బయిటపడ్డారు. వెన్నిసలి వ్యాపారి అనే షూటింగ్ నుంచి ఎర్నాకులం నుంచి వస్తున్న మమ్ముట్టికి ఈ ప్రమాదం జరిగింది.అయితే యాక్సిడెంట్ అయిన కాస్సేపటికే పోలీసులు వచ్చి రంగంలోకి దిగి బస్ డ్రైవర్ పై కేసు పెట్టి అరెస్ట్ చేయబోయారు.అయితే బస్ డ్రైవర్ తన తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరటంతో ముమ్మట్టి వదిలేసారు. పోలీసులును కూడా వదిలపెట్టమని సర్ది చెప్పి పంపించారు. ఇక ముమ్మట్టి ప్రస్తుతం వరసగా మళయాళంలో సినిమా లు చేయకుండా సెలక్టివ్ గా చేస్తున్నారు.అందులోనూ తన సినిమాలు భాక్సాఫీస్ వద్ద పెద్దగా నిలబడకపోవటంతో కూడా ముమ్మట్లి స్క్ర్రిప్టుని చెక్ చేసుకుని డైరక్టర్ తో రకరకాలుగా చర్చించి మాత్రమే చిత్రాలు చేస్తున్నారు.అలాగే యాక్షన్ సినిమాలు తగ్గించి కామిడికి ప్రాధాన్యత ఇస్తున్నారు. తన సహ నటుడు మరో స్టార్ హీరో మోహన్ లాల్ తో కలిసి త్వరలో ఓ చిత్రం చేయబోతున్నారు.అలాగే మళయాళ నటుడు మరియు రచయిత,దర్సకుడు అయిన శ్రీనివాసన్ తో కూడా ఓ చిత్రం చేయటానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

English summary
Mammootty suffered a big scare when a bus crashed into his car along the route from Aroor to Ernakulam. Neither the actor nor the occupants of the car suffered any injury but the car sustained a lot of damage.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu