»   » సూపర్ స్టార్ల మీద వర్మ కామెంట్: మమ్ముట్టీ మోహన్ లాల్ అసూయతో ఏడుస్తారు అంటూ

సూపర్ స్టార్ల మీద వర్మ కామెంట్: మమ్ముట్టీ మోహన్ లాల్ అసూయతో ఏడుస్తారు అంటూ

Posted By:
Subscribe to Filmibeat Telugu

రామ్ గోపాల్ వర్మ ఈసారి మలయాళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లను టార్గెట్ చేశాడు. కేరళలో సన్నీలియోన్ కు వచ్చిన ప్రజాస్పందనను చూసి వీరిద్దరూ అసూయతో ఏడుస్తారని ఫేస్ బుక్ ద్వారా కామెంట్ చేశాడు. సన్నీ కి ఉన్న క్రేజ్ ముందు ఈ సూపర్ స్టార్లు కూడా దిగదుడుపే అంటూ అంతటి అభిమానాన్ని చూపించిన కేరళవాసులమీద తన ప్రేమని కురిపించేసాడు.

Gallery : Fans Goes Crazy For Sunny Leone In Kerala

పాత జీవితానికి స్వస్తి

పాత జీవితానికి స్వస్తి

సన్నీ ఒకప్పుడు పోర్న్ స్టార్... అలా తాను ఒక శృంగార తారగా మారటానికి దారితీసిన పరిస్థితులను చెప్పుకొనీ, తనకున్న సమస్యలు తీరిపోయాక బాలీవుడ్ లోకి వచ్చి ఇప్పుడు ఆ పాత జీవితానికి స్వస్తి చెప్పేసింది కూడా. ఇప్పుడు బాలీవుడ్ లో ఆమె చేస్తున్నవి కొంత శృంగార పాత్రలే.

అవమానాలకు గురవుతూనే వచ్చింది

అవమానాలకు గురవుతూనే వచ్చింది

అయినా కొత్తగా సన్నీ వల్ల బాలీవుడ్ చెడి పోయిందేమీ లేదు ఆమెకంటే ముందే మల్లికా శరావత్, రాఖీ సావంత్ లాంటి నటీమణులు బాలీవుడ్ ని సుభిక్షంగానే ఉంచారు. కానీ సన్నీ ని మాత్రం ఆ పాత గతం వెంటాడుతూనే ఉంది. కొన్నిసార్లు బాలీవుడ్ లో ఆమె అవమానాలకు గురవుతూనే వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే కూడా బిజీ

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే కూడా బిజీ

అయితే నెమ్మదిగా పరిస్థితి మారుతోంది. ఆమెనీ ఒక నటిగా గుర్తిస్తున్నారు. ఆమెతో తమ సినిమాల్లో అందాలు ఆరబోయించడానికి ఫిల్మ్ మేకర్స్ మాత్రమే కాదు...పలు పాపులర్ మేగజైన్స్ కూడా తమ కవర్ పేజీలపై ఆమె హాట్ ఫోజుల కోసం పోటీ పడుతున్నాయి. మామూలుగా ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంటే కూడా బిజీగా ఉంది సన్నీ. రకరకాల షో లలో డాన్స్ చేయటానికి కూడా సన్నీ కి ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.

కేర‌ళ అభిమానులు

కేర‌ళ అభిమానులు

ఆమెకూ ఫ్యాన్స్ పెరుగుతున్నారు. నిన్నగాకమొన్న బాలీవుడ్ బ్యూటీ స‌న్నీ లియోన్ కి కేర‌ళ అభిమానులు ఘ‌న స్వాగ‌తం పలికారు. కొచ్చిలో ఓ మొబైల్ కంపెనీ ఇనాగ‌రేష‌న్ కోసం అక్క‌డికి వెళ్ళిన స‌న్నీని చూసేందుకు జ‌నాలు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు.

జ‌న‌సంద్రంగా మారింది

జ‌న‌సంద్రంగా మారింది

ఒక సూపర్ స్టార్ లాంటి హీరోగాని, లేక ఒక రాజకీయ నాయకుడు గాని వచ్చినా ఇంత జనం వస్తారో రారో తెలియదు గాని సన్నీ లియోన్ చూడటానికి అంతమంది కేర‌ళ అభిమానులు వచ్చారు. జనం రాక‌తో ఆ ప్రాంగ‌ణం మొత్తం జ‌న‌సంద్రంగా మారింది. కొచ్చిలోని ఎంజీరోడ్ లో ఉన్న షాప్ ఓపెనింగ్ కి సన్నీ రావ‌డం చాలా ఆల‌స్య‌మ‌వుతుంద‌ని తెలిసిన కూడా ఆమె కోసం గంట‌ల త‌ర‌బ‌డి వెయిట్ చేశారు అభిమానులు.

కేరళ ప్రజల సహృదయానికి

కేరళ ప్రజల సహృదయానికి

ఇసుక వేస్తే రాలనంతగా వచ్చిన అభిమానులతో రోడ్డు కిక్కిరిసిపోయింది. ఈ నేపథ్యంలోనే వర్మ సోషల్ మీడియాలో స్పందించాడు. సన్నీలియోన్ కు వచ్చినంత స్పందన గతంలో ఎన్నడూ మమ్ముట్టి, మోహన్ లాల్ లకు రాలేదని ఆయన తెలిపాడు. కేరళ ప్రజల సహృదయానికి, ఆదరించే స్వభావానికి శాల్యూట్ చేస్తున్నానని చెప్పాడు.

English summary
"Mammootty and Mohanlal will cry out of jealousy on Sunny Leone because they never got this kind of a crowd ..I salute the Kerala people for their extraordinary honesty" Ram Gopal Varma Posted in his facebook wall.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu