వైఎస్ఆర్ బయోపిక్ యాత్ర ఫస్ట్‌లుక్ రిలీజ్.. మమ్ముట్టి అదుర్స్
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న యాత్ర సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను శనివారం రిలీజ్ చేశారు. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ఈ చిత్రంలో వైఎస్ఆర్ పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. 350 చిత్రాలకు పైగా నటించిన అనుభవంతో వైఎస్ఆర్ పాత్రను సజీవంగా నిలిపేందుకు మమ్ముట్టి సిద్దమయ్యారు.
2004 సంవత్సరానికి ముందు అధికార ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తూ మండుటెండల్లో 60 రోజులపాటు దాదాపు 1500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తన యాత్రను ఉపయోగించుకొన్నారు.

70ఎంఎం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న యాత్ర సినిమాకు ఆనందోబ్రహ్మ ఫేం మహీ వీ రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
yatra mahi v raghav vijay chilla shashi devireddy mammootty యాత్ర విజయ్ చిల్లా శశి దేవిరెడ్డి మమ్ముట్టి మహీ వీ రాఘవ్


Click it and Unblock the Notifications