»   » నేను బజారు మనిషిని అనుకున్నా సరే: తాజా వివాదం పై మమతా మోహన్ దాస్ ( ఫొటో స్టోరీ)

నేను బజారు మనిషిని అనుకున్నా సరే: తాజా వివాదం పై మమతా మోహన్ దాస్ ( ఫొటో స్టోరీ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మమతా మొహన్ దాస్ హీరోయిన్ అవుదామనుకొని ఇండస్ట్రీకి వచ్చి గాయని గా మారి రెండురంగాల్లోనూ మరీటాప్ లో కాకపోయినా ఒక రెంజ్ వరకూ అనుకున్నది సాధించింది. అయితే తనకు వచ్చిన క్యాన్సర్ తో పోరాడుతూన్న సమయం లోనే నెమ్మదిగా కెరీర్ తగ్గు ముఖం పట్టింది.

ఆ తర్వాతకూడా నటించటానికీ పాడటానికి ప్రయత్నించినా మునుపటన్ని అవకాశాలు రాక పోవటం తో వెనుకకు తగ్గింది .ఈ జనవరిలో ఆమె నటించిన మళయాల సినిమా "టూ కంట్రీస్" తర్వాత ఒకటీ రెండు ప్రాజెక్టులే ఆమె చేతిలో ఉన్నాయి.ఇక వేరే భాషల్లో అసలు లేవు. నెమ్మదిగా ఎక్కువగా వార్తల్లోకి రావటం కూడా తగ్గించేసింది...

అయితే ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో తళుక్కున మెరిసింది మమతా . కళ్ళు చెదిరే గ్లామరస్ దుస్తుల్లో తళుక్కుమన్న మమతామోహన్‌దాస్ ఆ కార్యక్రమంలో తమిళ,మలయాళ భాషల్లో పాటలతో ఆ ప్రోగ్రాం కే సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్‌గా నిలిచారు.

అయితే ఆ వేదిక మీద ఆమె ధరించిన గ్లామరస్ దుస్తులు మాత్రం తర్వాత విమర్శలకు దారితీశాయి. మమతామోహన్ దాస్ వస్త్రాధరణ మీద విమర్శలు పెరుగుతున్నాయి. కొందరైతే మమత భారతీయురాలేనా అంటూ మితి మీరిన కామెంట్లతో దుమెత్తిపోస్తున్నారు. ఇక ఈ అంశం మీద ఈ అంశంపై స్పందించిన మమత మాత్రం ఘాటుగానే సమాధానం చెప్పింది. ఈ మోరల్ పోలిసింగ్ తనకేం కొత్తకాదనీ.., ఎవర్నీ లెక్క చేసేదాన్ని కాను అంటూ సమాధానం చెప్పేసింది...

"నేను ధరించిన దుస్తులు ఎబ్బెట్టుగా ఉన్నాయంటున్నారు. అలాంటి విమర్శలు నన్నేమీ బాధించవు. నచ్చలేదు అంటే వాళ్ళకి నచ్చలేదని నాకు నచ్చలేదని కాదు కదా. నాదుస్త్ల విసయం లోనే వాళ్ళకి అంత పట్టింపు ఉంటే ధరించే నాకు పట్టింపు ఉండక్కర్లేదా?? పని లేనివారే ఇలాంటి విమర్శలు చేస్తుంటారు.

ఆ డ్రెస్ ని నేను అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో కొనుగోలు చేశాను. కామెంట్లలో నన్నో బజారు మనిషితో పోల్చిన వారున్నారు.., హాలీవుడ్ నటి లా కనిపించావని కూడా కొందరు అన్నారు... నేను ఈ ఇద్దరి మాటలనీ పట్టించుకోను... ప్రస్తుతం నేను అలాంటి నగరంలోనే నివశిస్తున్నాను.అందువల్ల ఇలాంటి వంకర బుద్ధి విమర్శలు నన్ను ఎంత మాత్రం బాధించవు. ఎవరేమనుకున్నా నేను గ్లామరస్ దుస్తులు ధరించకుండా ఆపలేరు.." అంటూ చెప్పేసింది...

సింగర్ & యాక్టర్

సింగర్ & యాక్టర్

మమతా మోహన్ దాస్ అటు గాయని గానూ... ఇటు నటిగానూ దక్షిణాదిలో ఒక మంచి స్థానాన్ని అందుకుంది. యమదొంగ లాంటి సినిమాలో ఎన్టీఆర్ తో, నితిన్ తోనూ మరికొన్ని సిన్మాల్లోనూ మంచి పాత్రలే చేసింది మమత...

నటి గానే కొనసాగింది

నటి గానే కొనసాగింది

సింగర్ గా... జగడం (ముప్పియ్యారూ..ఇరవై నాలుగూ...) శంకర్ దాదా లోనూ (ఆకలేస్తే...) తాను పాడిన పాతలు అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి. హస్కీగా వినిపించే ఆమె వాయిస్.. ఐటం సాంగ్స్ కి మంచి ప్లస్ అయ్యింది. కానీ మమత కి నటి కావాలని ఉండటం తో =సింగర్ అవకాశాలకోసం తను ప్రయత్నించలేదు... చాలా ఆఫర్లను తిరస్కరించింది కూడా.

క్యాన్సర్ బారిన పడి

క్యాన్సర్ బారిన పడి

కెరీర్ మంచి ఊపులో ఉందగానే పెళ్ళి చేసేసుకుంది మమత..కానీ ఆ బందమూ ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత తనకు క్యాన్సర్ సోకింది...

మళ్ళీ మళ్ళీ

మళ్ళీ మళ్ళీ

ఒక సారి కాదు రెండుసార్లు తను క్యాన్సర్ తో పోరాడాల్సి వచ్చింది. ఆ సమయం లో ఎంతో ధైర్యం తో ఉంది మమతా... ఏమాత్రం తన ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు. బాబ్డ్ హెయిర్ తో కూడా నేను పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అన్నట్టు గానే కనిపించింది.

ఇంకో సారి తెర మీదకి

ఇంకో సారి తెర మీదకి

క్యాన్సర్ నయమయ్యాక మళ్ళీ రెట్టింపు ఉత్సాహం తో తెర మీదకి వచ్చింది మమతా... మరీ మునుపటన్ని అవకాశాలు లేకపోయినా. మళయాలం లో పరవాలేదు. మళ్ళీ కెరీర్ లో నిలదొక్కుకుంది.

వార్తల్లోకెక్కింది.

వార్తల్లోకెక్కింది.

చాలా కాలం గా వార్తలకీ వివాదాలకీ దూరంగా ఉన్న మమతా.... ఈ మధ్య ఇటీవల ఇంగ్లాండ్‌లో జరిగిన ఒక అవార్డుల కార్యక్రమంలో తాను వేసుకున్న డ్రెస్ వల్ల... మళ్ళీ వార్తల్లోకెక్కింది.

ఆనంద్ టీవీ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్

ఆనంద్ టీవీ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్

మాంచెస్టర్ లో జరిగిన ఆనంద్ టీవీ ఫిల్మ్ అవార్డ్ ఫంక్షన్ లో ఉత్తమ గాయని గా విజయ్ ఏసుదాసు చేతులమీదుగా అవార్డ్ అందుకుని. తన మళయాల,తమిళ పాటలతో అలరించింది.

దుస్తుల మీద దుమారం

దుస్తుల మీద దుమారం

అయితే అనుకోకుండా ఆమె ధరించిన దుస్తుల మీద దుమారం చెలరేగింది. అయితే ఆ వేదిక మీద ఆమె ధరించిన గ్లామరస్ దుస్తులు విమర్శలకు దారితీశాయి. మమతామోహన్ దాస్ వస్త్రాధరణ మీద విమర్శలు పెరుగుతున్నాయి. కొందరైతే మమత భారతీయురాలేనా అంటూ మితి మీరిన కామెంట్లతో దుమెత్తిపోస్తున్నారు.

ఘాటుగానే సమాధానం:

ఘాటుగానే సమాధానం:

ఇక ఈ అంశం మీద ఈ అంశంపై స్పందించిన మమత మాత్రం ఘాటుగానే సమాధానం చెప్పింది. ఈ మోరల్ పోలిసింగ్ తనకేం కొత్తకాదనీ.., ఎవర్నీ లెక్క చేసేదాన్ని కాను అంటూ సమాధానం చెప్పేసింది...

పట్టించుకోను

పట్టించుకోను

కామెంట్లలో నన్నో బజారు మనిషితో పోల్చిన వారున్నారు.., హాలీవుడ్ నటి లా కనిపించావని కూడా కొందరు అన్నారు... నేను ఈ ఇద్దరి మాటలనీ పట్టించుకోను... ప్రస్తుతం నేను అలాంటి నగరంలోనే నివశిస్తున్నాను.అందువల్ల ఇలాంటి వంకర బుద్ధి విమర్శలు నన్ను ఎంత మాత్రం బాధించవు. ఎవరేమనుకున్నా నేను గ్లామరస్ దుస్తులు ధరించకుండా ఆపలేరు.." అంటూ చెప్పేసింది.

నేను బజారు మనిషిని అనుకున్నా సరే: తాజా వివాదం పై మమతా మోహన్ దాస్ ( ఫొటో స్టోరీ)

నేను బజారు మనిషిని అనుకున్నా సరే: తాజా వివాదం పై మమతా మోహన్ దాస్ ( ఫొటో స్టోరీ)

నిజమే చావుదగ్గరి దాకా వెళ్ళొచ్చిన మమతాని ఇక అంతకంటే ఏవిశయమూ పెద్దగా భాదపెట్టదు. ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితాన్ని ముందుకన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది..

నిజమే చావుదగ్గరి దాకా వెళ్ళొచ్చిన మమతాని ఇక అంతకంటే ఏవిశయమూ పెద్దగా భాదపెట్టదు. ఆమె చేయాలనుకున్నది చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆమె జీవితాన్ని ముందుకన్నా ఎక్కువగా ప్రేమిస్తోంది.. ఎవరు విమర్శించినా,మెచ్చుకున్నా ఇప్పుడు మమతా మరీ ఎక్కువగా పట్టించుకోవటం లేదు. ఆమె కి ఇప్పుడు తాను చేయ వలసిన పనిమీద తప్ప మరే విసయాన్నీ పట్టించుకోదు... అంటూ చెప్పారు ఆమె సన్నిహితులొకరు...

English summary
Gorgeous Mamta Mohandas became the pick of criticism after she appeared in a live show with a dress that is alleged to be "exposing" more than it covered.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu