»   » 'దమయంతి' గా మైధిలాజికల్ పాత్రలో మమతా మోహన్ దాస్

'దమయంతి' గా మైధిలాజికల్ పాత్రలో మమతా మోహన్ దాస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాగార్జునతో చేసిన 'కేడీ' చిత్రమైనా కలిసివస్తుందంటే అది డిజాస్టరై కూర్చుంది. అంతకుముందు చేసిన 'కింగ్' యావరేజ్ అయినా ఒక్క ఆఫరూ రాలేదు. దాంతో పూర్తి నిరాశచెందిన మమతా మోహన్ దాస్ తెలుగు ఫీల్డ్ కు మమతానురాగాలు లేవని డిసైడే తన మాతృభాష మళయాళంకి తరిలిపోయింది. అక్కడామె తాజాగా 'నిరకజ్జాచ' అనే చిత్రం కమిట్ అయింది. ఈ చిత్రంలో ఆమె ద్విపాత్రాభినయం చేస్తోంది. అలాగే ఈ చిత్రంలో ఇటాలియన్ నటడు ఒకరు లీడ్ రోల్ చేస్తున్నారు. అనీష్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తీర్చిదిద్దుతానని రోజుకో ప్రకటన చేస్తున్నాడు. ఇక ఈ చిత్ర కథ విచిత్రంగా జరుగుతుంది. ఇటలీనుంచి వచ్చిన ఆర్టిస్టు ఒకరు రాజా రవి వర్మ చిత్రంతో ప్రేమలో పడతాడు. ఆ చిత్రం ఏమిటీ అంటే నల దమయంతులది. చిత్రం లోని దమయంతి ని చూసిన అతను మోహావేశ పూరితుడు అవుతాడు. అతని ఊహల్లో కనిపించే దమయంతిగా మమతా మోహన్ దాస్ చేస్తోంది. మరో మమతా పాత్ర నిజ జీవితంలో ఉండి ఆ ఆర్టిస్టుకు తారసపడుతుంది. ఇక ఈ చిత్రంపై మమతా చాలా ఆశలు పెట్టుకుంది. ఆ దర్శకుడు కొత్త వాడైనా తనకు మళయాళంలో మళ్ళీ లైఫ్ ఇస్తాడని హిట్ కొడతాడని భావించి, మీడియాకు అదే పనిగా శెలవిస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu