»   » తప్పుడు కథనాలు: మీడియాపై హాట్ లేడీ ఫైర్

తప్పుడు కథనాలు: మీడియాపై హాట్ లేడీ ఫైర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సౌతిండియా నటి, సింగర్ మమతా మోహన్ దాస్ ఇటీవల మీడియాలో తన గురించి వచ్చిన వార్తలపై భగ్గుమంది. మేఘనా రాజ్ సోషల్ యాక్టివిస్ట్‌గా నటించనున్న ఓ మళయాల చిత్రంలో మమతా మోహన్ దాస్ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషిస్తున్నట్లు కొన్ని టీవీ ఛానల్స్‌లో వార్తలు వెలువడ్డాయి.

ఈ విషయమై మమతా మోహన్ దాస్ ట్విట్టర్లో స్పందిస్తూ....'ఇదొక ఫేక్ న్యూస్. కొన్ని ఛానల్ష్ తమ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. నేను అసలు ఆ సినిమాకు సైన్ చేయనేలేదు. కేవలం వాళ్ల వార్తల కోసమే నా గురించిన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దయచేసి మీడియా వారు నిజాలు వెల్లడించండి' అని మమతా మోహన్ దాస్ చెప్పుకొచ్చారు.

Mamta Mohandas warns media

ఆ మధ్య క్యాన్సర్ బారిన పడ్డ మమతా మోహన్ దాస్ సినిమాలకు దూరంగా ఉంటూనే వస్తోంది. ఆమె నటించిన చివరి చిత్రం గత సంవత్సరం జూన్ నెలలో విడుదలైంది. ఆ తర్వాత మమతా మోహన్ దాస్ ఏ సినిమాలోనూ నటించలేదు. ఇక తెలుగులో మమతా మోమన్ దాస్ నటించిన చివరి చిత్రం 2009లో నాగార్జున హీరోగా వచ్చిన 'కేడీ'.

త్వరలోనే మహతా మోహన్ దాస్ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్లాన్ చేసుకుంటోందని తెలుస్తోంది. ఇప్పటికే ఆమెను పలువురు తమిళ నిర్మాతలతో పాటు, మళయాల చిత్ర నిర్మాతలు సంప్రదించారు. అయితే ఆమె ఏ చిత్రానికి కూడా ఓకే చెప్పలేదని తెలుస్తోంది.

English summary
Apparently Mamta Tweeted: “Guess it's a fake news that showed up on some channel that's having it's trial run... Guess they got what they wanted.. Hungama ho Gaya....aaaand this is a movie that I haven't signed up for either. Media... Pls get t facts right!”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu