ప్రకాష్ రాజ్ ‘మన ఊరి రామాయణం’ (టీజర్)
ప్రకాశ్‌రాజ్ తన సొంత బ్యానర్‌పై తెరకెక్కిస్తున్న చిత్రం 'మన వూరి రామాయణం'. తన విలక్షణ నటనతో ఎలాంటి పాత్రనైనా రక్తికట్టించగల నటుడు ప్రకాశ్ రాజ్, నిర్మాతగా, దర్శకుడిగానూ అద్భుతమైన ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే.
'ఆకాశమంత', 'ధోని', 'ఉలవచారు బిర్యాని', 'గౌరవం' లాంటి పలు అభిరుచి గల సినిమాలను రూపొందించి దర్శక నిర్మాతగా ప్రకాశ్, తనదైన బ్రాండ్ సృష్టించారు. తాజాగా ఆయన దర్శకత్వంలో 'మన ఊరి రామాయణం' అన్న ఆసక్తికర టైటిల్‌తో ఓ సినిమా విడుదలకు సిద్ధమైంది.
మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఈ సినిమాలో అంతా కొత్తవాళ్ళే నటించగా ప్రకాష్ రాజ్ స్వయంగా నిర్మించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పక్కాగా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెన్సార్‌కు కూడా వెళ్ళనుంది.
ప్రకాష్ రాజ్ ఇదే విషయాన్ని తెలియజేస్తూ, సినిమా సెన్సార్‌కు సిద్ధంగా ఉందని, ఆగష్టులో సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు. ఈ సినిమా ఒక కల.. ఒక ప్రయాణం.. ఒక అవగాహన, అందరికీ తప్పక నచ్చుతుంది అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












