»   » నవంబ‌ర్ 4న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ మ‌న‌లో ఒక‌డు

నవంబ‌ర్ 4న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ మ‌న‌లో ఒక‌డు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆర్పీ ప‌ట్నాయ‌క్ న‌టిస్తూ, సంగీతం అందిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కించిన చిత్రం మ‌న‌లో ఒక‌డు. యూనిక్రాఫ్ట్ మూవీ పతాకంపై జగన్ మోహన్ నిర్మిస్తున్నారు. 'నువ్వు నేను' ఫేం అనితా హెచ్. రెడ్డి కథానాయికగా న‌టించారు. ఈ సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సంద‌ర్భంగా....ఆర్పీ ప‌ట్నాయ‌క్ మాట్లాడుతూ మ‌న‌లో ఒక‌డుపాట‌ల‌కు మంచి రెస్పాన్స్ రావ‌డంతో ఇటీవ‌ల తిరుప‌తిలో వ‌న్ మిలియ‌న్ క్లిక్స్ డిస్క్ ఫంక్ష‌న్స్ నిర్వ‌హించాం. థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌కు అనూహ్య‌మైన స్పంద‌న వ‌చ్చింది. కొన్ని య‌దార్థ ఘ‌ట‌నల‌ ఆధారంగా మ‌న‌లో ఒక‌డు క‌థ‌ను రాసుకున్నాం. ఈ సినిమాలో నేను కృష్ణ‌మూర్తి అనే అధ్యాప‌కుడి పాత్ర‌లో న‌టించాను. ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర అది. డైలాగ్ కింగ్ సాయికుమార్‌గారి పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. మ‌న‌లో ఒక‌డు సినిమా ఫస్ట్ కాపీ సిద్ధ‌మైంది. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త్వ‌ర‌లో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి సినిమాను న‌వంబ‌ర్ 4న విడుద‌ల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు.

Manalo Okadu on 4th November

నిర్మాత జగన్ మోహన్ మాట్లాడుతూ ప్ర‌స్తుత స‌మాజంలో మీడియా పాత్ర ఏంటో మ‌నందరికీ తెలుసు. అలాంటి మీడియా నేప‌థ్యంలో సాగే క‌థ‌తో ఈ సినిమాను తెర‌కెక్కించాం. ఇటీవ‌ల విడుద‌లైన పాట‌ల‌కు, థియేట్రిల‌క్ ట్రైల‌ర్‌కు చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫ‌స్ట్‌కాపీ సిద్ధ‌మైంది. సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి న‌వంబ‌ర్ 4న సినిమాను విడుద‌ల చేయ‌డానికి సన్నాహాలు చేస్తున్నాం అని చెప్పారు.

సాయికుమార్‌, జెమిని సురేశ్ త‌దిత‌రులు న‌టించిన ఈ సినిమాకు కెమెరామేన్: ఎస్‌.జె.సిద్ధార్థ్‌, స‌హ నిర్మాత‌లు: ఉమేశ్ గౌడ‌, బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం, క్రియేటివ్ హెడ్: గౌత‌మ్ ప‌ట్నాయ‌క్‌, పాట‌లు: చైత‌న్య ప్ర‌సాద్‌, వ‌న‌మాలి, పుల‌గం చిన్నారాయ‌ణ‌.

English summary
RP Patnaik's next film 'Manalo Okadu' is all done is gearing up for a Nov 4 release.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu