»   » ఫిల్మ్‌ఫేర్: మనం చిత్రానికి అవార్డుల పంట, ఉత్తమ నటుడు అల్లు అర్జున్

ఫిల్మ్‌ఫేర్: మనం చిత్రానికి అవార్డుల పంట, ఉత్తమ నటుడు అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: అక్కినేని కుటుంబానికి చెందిన మనం చిత్రానికి ఫిల్మ్‌ఫేర్ అవార్డుల పంట పండింది. చెన్నై 62వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఐదింటిని మనం చిత్రం దక్కించుకుంది. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వర రావు నటించిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు నాగార్జున, నాగచైతన్య నటించారు.

మనం ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ఉత్తమ దర్శకత్వం, ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ గేయ రచయిత, ఉత్తమ ఛాయా గ్రహణం విభాగాల్లో ఆ చిత్రం అవార్డులను సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా శ్రుతిహాసన్ ఎంపికయ్యారు.

Manam

రేసు గుర్రం సినిమాకు మూడు అవార్డులు వచ్చాయి. తన అవార్డును అక్కినేని నాగేశ్వర రావుకు అంకితమిస్తున్నట్లు అల్లు అర్జున్ చెప్పారు.

ఉత్తమ చిత్రం మనం
ఉత్తమ దర్శకుడు విక్రమ్‌కుమార్(మనం)
ఉత్తమ సంగీత దర్శకుడు-అనుప్ రూబెన్స్(మనం)
ఉత్తమ గేయ రచయిత-చంద్రబోస్(మనం)
ఉత్తమ ఛాయాగ్రహకుడు- పి.ఎస్ వినోద్(మనం)
రేసుగుర్రం చిత్రానికి మూడు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు లభించాయి.
ఉత్తమ నటుడు- అల్లు అర్జున్(రుసుగుర్రం)
ఉత్తమ నటి -శృతి హాసన్(రేసుగుర్రం)
ఉత్తమ నేపథ్య గాయకుడు- సింహా(రేసుగుర్రం)
ఉత్తమ సహాయ నటుడు- జగపతిబాబు( లెజెండ్)
ఉత్తమ సహాయ నటి- మంచు లక్ష్మి( చందమామ కథలు)
ఉత్తమ నేపథ్య గాయని- సునీత(ఊహలు గుసగుసలాడే)
ఉత్తమ నూతన నటుడు- బెల్లంకొండ శ్రీనివాస్( అల్లుడు శీను)

English summary
Akkineni Family's Manam filn bagged 5 film fare awards. Allu Arjun has bagged best actor award for Resu Gurram film.
Please Wait while comments are loading...