»   »  ‘మనం’ పబ్లిక్ టాక్ ఈ రేంజిలో ఉందేంటి స్వామి...!

‘మనం’ పబ్లిక్ టాక్ ఈ రేంజిలో ఉందేంటి స్వామి...!

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అక్కినేని మూడు తరాల హీరోల నటించిన మల్టీస్టారర్ మూవీ 'మనం' చిత్రం ఈ రోజు గ్రాండ్‌గా విడుదలైన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు నటించిన చివరి సినిమా కావడంతో ఈచిత్రంపై ముందు నుండి మంచి అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రం ప్రీమియర్ షో తర్వాత సినిమా టాక్ హై రేంజిలో వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయం అంటున్నారు ప్రిమియర్ షో చూసిన జనాలు.

  అయితే ప్రీమియర్ షో చూసే వారంతా క్లాస్ ప్రేక్షకులే ఉంటారు కాబట్టి.....ఇదే రిజల్ట్ అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి వస్తుందా? లేదా? అనేది ఇండియాలో ఫస్ట్ డే పూర్తయతే గానీ చెప్పలేం. ఏది ఏమైనా మనం చిత్రం ప్రీమియర్ షో టాక్‌తో నాగార్జున ఫుల్ హ్యాపీగా ఉన్నారు.

  Manam movie public talk

  ఈ మధ్యకాలంలో వరస ఫ్లాపులతో ముందుకు వెళ్తున్న నాగార్జున ఈ చిత్రం హిట్ తో ఊపిరిపీల్చుకోవాలని భావిస్తున్నారు. దానికి తగ్గట్లే చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. అక్కినేని చివరి చిత్రం కావటం కూడా ఎమోషనల్ గా ఈ చిత్రం ఆయన అభిమానులకు గిప్ట్ గా భావిస్తున్నారు. ఈ చిత్రం 1920 నుంచి 2030 మధ్య వంద సంవత్సరాలలో జరిగిన కథగా తెరకెక్కింది.

  అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

  English summary
  Telugu movie Manam, which has been written and directed by Vikram Kumar, has created headlines for several positive reasons. Mainly, it has been hyped the most because it features three generation stars of Akkineni family, which is happening for the first time in the Indian cinema. This is the last movie of late legendary actor Akkineni Nageswara Rao, who died of cancer on January 22, 2014.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more