మనం : అలాచేసి ఉంటే రూ. 100 కోట్లు వసూలయ్యేవి!

By Bojja Kumar

 Manam will Cross 100 crores in Bollywood: RGV
హైదరాబాద్: అక్కినేని మల్టీస్టారర్ మూవీ 'మనం' నిన్న విడుదలై బాక్సాఫీసు వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం అద్భుతంగా ఉందని, అక్కినేని ఈ చిత్రం రూపంలో ఎప్పటికీ జీవించే ఉంటారని పలువురు ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ చిత్రంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బాలీవుడ్లో ఈచిత్రం తీసి ఉంటే రూ. 100 కోట్లు వసూలు అయ్యేవని రామ్ గోపాల్ వర్మ అంటున్నారు.

'మనం చిత్రం చూసాను. ఈ చిత్రం బాలీవుడ్లో తీసి ఉంటే తప్పకుండా రూ. 100 కోట్లు వసూలు చేసే సినిమాగా నిలిచేది. సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఇదొక సరికొత్త కాన్సెప్టు' అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు. నాగ చైతన్య తొలిసారి నాగార్జునతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కానీ ఎలాంటి జంకు లేకుండా నటించారు. నాగార్జున నాగేశ్వరరావుగారితో కలిసి చేసిన తొలిసినిమాతో పొల్చుకుంటే నాగ చైతన్య గొప్పగా నటించాడు. మనం చిత్రం విజయాన్ని ఆస్వాదించడానికి ఏఎన్ఆర్ లేక పోవడం బాధ కలిగించే విషయం' అని రామ్ గోపాల్ వర్మ చెప్పుకొచ్చారు.

అక్కినేని,నాగార్జున, చైతన్య కలిసి నటించిన ఈ సినిమాలో సమంత, శ్రీయ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, నాగినీడు, శరణ్య, కాశీవిశ్వనాథ్, రవిబాబు, వెన్నెల కిషోర్, మెల్కొటే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈచిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X