»   » సూపర్బ్: మోహన్ లాల్ ‘మనమంతా’ ట్రైలర్

సూపర్బ్: మోహన్ లాల్ ‘మనమంతా’ ట్రైలర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ ప్ర‌ధాన‌పాత్ర‌లో చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాత సాయికొర్రపాటి వారాహి చలన చిత్రం బ్యానర్ పై రూపొందిన చిత్రం మనమంతా. ఆగస్టు 5న విడుదల కాబోతున్నఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈ రోజు రిలీజైంది.

మధ్యతరగతి జీవుల జీవితాన్ని ప్రతిబింభిస్తూ తెరకెక్కించిన ఈ మూవీ మనం నిత్య జీవితంలో రోజూ చూసే అంశాల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుందని తెలుస్తోంది. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉంది. ట్రైలర్ పై మీరూ ఓ లుక్కేయండి.ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని క్లీన్ యు స‌ర్టిఫికేట్ ను పొందింది. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల్లో సినిమా ఆగ‌స్టు 5న గ్రాండ్ రిలీజ్ కానుంది. సీనియ‌ర న‌టి గౌత‌మి స‌హా గౌత మి, విశ్వాంత్, రైనా రావులు కూడా ఈ చిత్రంలో నటించారు.


మానవ సంబంధాలు, ఎమోషన్స్, సెన్సిబిలిటీస్ తో కూడిన నలుగురు వ్యక్తుల ప్రయాణమే మ‌న‌మంతా. క‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే చిత్ర‌మ‌వుతుంద‌ని ద‌ర్శ‌క నిర్మాత‌లు తెలియ‌జేశారు.

English summary
The most awaited Trailer / trailer of Manamantha - One World Four Stories is out now. Check it out!!. Manamantha Movie casts Mohanlal, Gouthami, Viswant, Raina Rao, Anisha Ambrose, Urvasi, Nassar, Gollapudi Maruthi Rao, Parachuri Venkateswara Rao,Vennela Kishore, Dhanraj, Praveen, Naveen Neni, Harshavardhan, Ayyapa, P.Sharma and others in the movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu