twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇంట్లోనే ఉంటూ.... పవన్ ని బావా అని పిలుస్తుందిట...సరసాలు, సరదాలు

    By Srikanya
    |

    హైదరాబాద్‌: పవన్‌కల్యాణ్‌ చిత్రమంటే కేవలం అభిమానులు మాత్రమే కాదు.. తెలుగు చిత్ర పరిశ్రమ మొత్తం ఆసక్తిగా గమనిస్తూ ఉంటుంది. సినిమా ప్రారంభమైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకు ఆయన సినిమాకు సంబంధించిన ప్రతీ అంశం ఉత్సుకతను కలిగిస్తుంది. ఇక అభిమానుల సంగతి వేరే చెప్పనక్కర్లేదు. జల్సా, పులి, పంజా, గబ్బర్‌సింగ్‌, సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ ఇలా ఆయన సినిమా టైటిళ్లు కూడా మాస్‌ను మెప్పించేలా ఉంటాయి. ఇప్పుడు తాజాగా 'కాటమరాయుడు'గా పవన్‌కల్యాణ్‌ రాబోతున్నారు. ఈ చిత్రం గురించి ఇప్పుడు మీకో ఆసక్తికరమైన విశషం అందిస్తన్నాం.

    పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా వచ్చే చిత్రంలో ప్రతీ అంశమూ ఆసక్తికరమే. ఆయన సినిమాలో పాత్ర దొరికిందంటే ఆ నటుల ఆనందమే వేరు. అందుకేనేమో తాజాగా పవన్ చిత్రం కమిటైన మానస హిమవర్ష తన ఆనందాన్ని మీడియా వద్ద ఎక్సప్రెస్ చేసింది. అయితే కథని కొద్దిగా లీక్ చేసేసింది.

    డైరక్టర్ డాలీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రంలో పవన్‌ మరదలి పాత్రను తాను పోషిస్తున్నట్లు నటి మానస హిమవర్ష తెలిపారు. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయం చెప్పారు.

    మానస మాట్లాడుతూ.. 'పవన్‌కల్యాణ్‌ మరదలిగా, ఆయన్ను ఇష్టపడే వ్యక్తిగా ఈ చిత్రంలో నేను కనిపిస్తాను. నేను పవన్‌ ఇంట్లోనే ఉంటూ తన సోదరులతో కలిసి ఆయన్ను టీజ్‌ చేస్తుంటా. దాదాపు పట్టులంగా, లంగావోణీలోనే కనిపిస్తా. పవన్‌తో కలిసి పనిచేయడం ఆయన అభిమానిగా నాకు చాలా సంతోషంగా ఉంది' అని మానస అన్నారు.

    మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు క్రింద చదవండి

    బ్రేక్ ఇస్తాడు పవన్

    బ్రేక్ ఇస్తాడు పవన్

    ప్రస్తుతం మానస ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటున్నారు. శ్రుతిహాసన్‌ ఇందులో హీరోయిన్ గా నటిస్తున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మానస పాత్ర బాగా పేలుతుందని దర్శక,నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు. మానస సైతం తనకు బ్రేక్ వస్తుందని భావిస్తోంది.

    ఇంతకు ముందు ఈ మరదలు

    ఇంతకు ముందు ఈ మరదలు

    కనీసం ఆడిషన్స్ కూడా లేకుండా పవన్ సినిమా ‘కాటమరాయుడు' లో ఛాన్స్ దక్కించుకుంది నటి ‘మానస హిమవర్ష'.మోడల్ గా, డ్యాన్సర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్టుగా చేసే ఈమె ‘రొమాన్స్' అనే సినిమాలో ఓ పాత్రలో మెరిసింది. ఇక ఇప్పుడు పవన్ సినిమాలో ఆయనకు కొంటె మరదలిగా నటించే అవకాశం దక్కించుకుంది.

    మొన్నే మొదలంది

    మొన్నే మొదలంది

    'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' తర్వాత పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ హీరోగా నటిస్తున్న 'కాటమరాయుడు' చిత్రం షూటింగ్‌ బుధవారం సికింద్రాబాద్‌లో ప్రారంభమైంది. ఈ నెల 24 నుంచి పవన్‌ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నారు. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శరత్‌ మరార్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్‌కల్యాణ్‌ సరికొత్త ప్రేమికుడిగా కనిపించనున్నారు. పవన్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూరుస్తున్నారు.

    పవన్‌కల్యాణ్‌, అలీ, అభినవ్‌ సింగ్‌, రావు రమేష్‌లపై

    పవన్‌కల్యాణ్‌, అలీ, అభినవ్‌ సింగ్‌, రావు రమేష్‌లపై

    బుధవారం నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలైన ఈ చిత్రం... 15 రోజులపాటు పవన్‌కల్యాణ్‌, అలీ, అభినవ్‌ సింగ్‌, రావు రమేష్‌లపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. ఫ్యాక్షన్‌ నేపథ్యంతో కూడిన ఓ ప్రేమకథతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్‌కల్యాణ్‌ ఇదివరకటి చిత్రాలకి భిన్నంగా, ఓ ప్రత్యేకమైన గెటప్‌లో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

    పవన్ క్యారక్టర్ ఇదే

    పవన్ క్యారక్టర్ ఇదే

    ఈ సినిమాలో వయసు పైబడిన కారణంగా పెళ్ళికి దూరంగా వుండే ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో పవన్ కనిపించనున్నాడు. పవన్ అభిమానులు ఆశించే ఎంటర్టైన్మెంట్ - పంచ్ లు ఈ సినిమాలో పుష్కలంగా జోడించారట. ఫుల్ పటాస్ లా జోరుగా ఉషారుగా సాగుతుందిట పవన్ పాత్ర. ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు.

    తమిళ చిత్రం రీమేకే

    తమిళ చిత్రం రీమేకే

    అందుతున్న సమచారం మేరకు ఈ చిత్రం తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమాకి ఇది అఫీషియల్ రీమేక్. తాను షూటింగ్ లో పాల్గొనబోతున్న కాటమరాయుడు సినిమాని మొదట్లో తమిళ దర్సకుడు సూర్య చేతిలో పెట్టి తరవాత అతన్ని తప్పించిన పవన్ ఇప్పుడు పగ్గాలు ఇచ్చి నడిపే బాధ్యత డాలీ కి అప్పజేపాడు.

    మూల కథను దాటకుండా

    మూల కథను దాటకుండా

    అయితే దర్శకుడు సూర్య తరవాత డాలీ వచ్చినా కూడా స్క్రిప్ట్ లో మార్పులు జరగలేదు. మొదట్లో పవన్, డాలీ లకి కలిసే తీరిక కూడా లేదట. ఈ మధ్యనే ఈ సినిమా స్క్రిప్ట్ గురించి చర్చించిన పవన్ దబాంగ్ తరహా లో ఒరిజినల్ స్క్రిప్ట్ కి వీలైనన్ని మార్పులు చేస్తూ సినిమా మూల కథ ఎక్కడా ఇబ్బంది పడకుండా కొన్ని కొత్త సీన్ లు రాయమని కోరాడట. దాంతో డాలి అద్బుతమైన స్క్రిప్టు రెడీ చేసారని సమచారం. వెంటనే పవన్ ఓకే చేసి పట్టాలు ఎక్కించేసారు.

    కమిడియన్ కోసం అనుకున్న టైటిల్

    కమిడియన్ కోసం అనుకున్న టైటిల్

    మొదట ఈ టైటిల్ ని కమెడియన్ సప్తగిరి హీరోగా చేస్తున్న మూవీ ఫిక్స్ చేసి రిజిస్టర్ చేసినట్లుగా కూడ వార్తలు వస్తున్నాయి. అయితే పవన్ సినిమా నిర్మాతలు అడిగితే సప్తగిరి తో 'కాటమరాయుడు' టైటిల్ తో సినిమాను తీస్తున్న నిర్మాతలు ఆ టైటిల్ ను పవన్ కు ఇచ్చివేసారని చెప్తున్నారు. అయినా సప్తగిరి కోసం రిజిస్టర్ చేసిన టైటిల్ తో పవర్ స్టార్ నటించడం ఏమిటి అని పవన్ అభిమానులు తమ అయిష్టాన్ని వ్యక్తపరుస్తున్నట్లు టాక్. కానీ సినిమా చూస్తే ఖచ్చితంగా అదే టైటిల్ ఫెరఫెక్ట్ అని ఫీలవుతారని చెప్తున్నారు.

    బస్టాండ్ లో ప్రారంబించారు

    బస్టాండ్ లో ప్రారంబించారు

    పవన్ కళ్యాణ్ షూటింగ్ స్పాట్ కు రాకపోయినా కాటమరాయుడు' లో నటిస్తున్న పవన్ పాత్ర ప్రస్తావనతో వానను కూడ లెక్క చేయకుండా 'కాటమరాయుడు' షూటింగ్ జూబ్లిహిల్స్ బస్టాండ్ లో చడీచప్పుడు లేకుండా ప్రారంభం అయ్యింది. షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది సేపటికే అది పవన్ 'కామరాయుడు' షూటింగ్ అని తెలియడంతో సాధారణ జనం నిజంగా అక్కడ పవన్ ఉన్నాడేమో అనుకుని కొద్ది సేపు అక్కడ సందడి చేయడం స్పష్టంగా కనిపించింది. అయితే చాల గ్యాప్ తరువాత ఈ సినిమా షూటింగ్ నిన్న మళ్ళీ ప్రారంభం కావడంతో ఈ సినిమాలోని కథ రీత్యా ఒక బస్ స్టాండ్ కు సంబంధించిన సన్నివేశం ఉండటంతో నిన్న జూబ్లీహిల్స్ బస్ స్టాండ్ ను ఈ సినిమా దర్శక నిర్మాతలు ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

    హీరోయిన్ లేకుండానే...

    హీరోయిన్ లేకుండానే...

    ఈ చిత్రం కోసం వరుసగా పదిరోజులు షూటింగులో పవన్ పాల్గొంటాడని తెలుస్తోంది. ఈ సినిమా లో పవన్ పక్కన హీరోయిన్ గా నటిస్తున్న శృతిహాసన్ తన 'సింగం-3' షూటింగ్ కోసం లండన్ వెళ్ళడంతో శృతి తిరిగి వచ్చేదాకా కేవలం పవన్ కు సంబంధించిన సీన్స్ షూటింగ్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా ఒక్కసారి సెట్స్‌ మీదకు వెళ్ళాక సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతుందని నిర్మాత శరద్‌ మరార్‌ చెపుతున్నారు.

    క్యారక్టర్ కోసం...పవన్

    క్యారక్టర్ కోసం...పవన్

    ఇప్పటికే ఈ సినిమా కోసం పవన్ బెంగుళూరులోని ఒక జిమ్ లో తన పర్సనల్ ట్రైనర్ సమక్షంలో తన లుక్ కు సంబంధించిన వర్కవుట్స్ పూర్తి చేసుకుని షూటింగ్ కు రెడీ చెప్పాడు. ఈ సినిమాలో ఫ్యాక్షనిస్ట్ పాత్ర ఫన్ తో నడిచినా సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లకు ఫిట్ బాడీ ఉండటం అవసరమని భావించిన పవన్ , అందుకు తగినట్లుగా రెడి అవ్వటం అభిమానులను ఆనందపరిచే విషయం.

    కీచక అమ్మాయిని సీన్ లోకి

    కీచక అమ్మాయిని సీన్ లోకి

    ఈ సినిమాలో పవన్ బ్రదర్శ్ లో ఒకరికి జోడీగా.. యామినీ భాస్కర్ అనే కొత్తమ్మాయిని ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈమె కూడ ఈనెల 24వ తారీఖు నుండి పవన్ తో కలిసి 'కాటమరాయుడు' షూటింగ్ లో పాల్గోనబోతున్నట్లు టాక్. యామినీ భాస్కర్ కూడా ఇదే విషయం ఖరారు చేసి చెప్పింది. అయితే ఈ సినిమాలో యామిని పాత్ర ఏమిటి అన్నది పూర్తిగా క్లారిటీ లేకపోయిన గతంలో విడుదల అయిన 'కీచక' అనే సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిన ఈ ఫెయిల్యూర్ హీరోయిన్ ను ఇప్పుడు ఇంత హఠాత్ గా ఎందుకు రంగంలోకి తీసుకు వచ్చారు అన్న విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

    కెమెరామెన్ ని మార్చేసారు

    కెమెరామెన్ ని మార్చేసారు

    రెండు రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానుండగా.. కాటమరాయుడు టెక్నికల్ టీమ్ లో కీలకమైన మార్పు చోటు చేసుకోవటం కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. ఈ చిత్రానికి తమిళ్ సినిమాటోగ్రాఫర్ సౌందరరాజన్ ని మొదట ఎంచుకున్నారు. కానీ ఇప్పుడు పవన్ లేటెస్ట్ మూవీకి ప్రసాద్ మూరెళ్లను సినిమాటోగ్రాఫర్ గా ఫైనల్ చేశారు. ఈయన అత్తారింటికి దారేది చిత్రానికి పవన్ తో కలిసి పని చేసిన అనుభవం ఉంది.

    కెమెరా మెన్ మార్పుకు అసలు రీజన్

    కెమెరా మెన్ మార్పుకు అసలు రీజన్

    గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలోనూ మొదట అనుకున్న దర్శకుడుతో పాటు, కెమెరామెన్ ని మార్చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది. దాంతో మళ్లీ సర్దార్ గబ్బర్ సింగ్ సీన్ రిపీట్ అవుతుందని కామెంట్స్ వస్తున్నాయి. కానీ కాటమరాయుడు షూటింగ్ ఆలస్యం కావంతో.. వేరే సినిమాల డేట్స్ తో క్లాష్ వచ్చే పరిస్థితి సౌందర రాజన్ కి ఏర్పడిందట. అందుకే తప్పుకుంటున్నాడని తెలుస్తోంది. సరిగ్గా షూటింగ్ స్టార్ట్ అయ్యేముందు చోటు చేసుకున్న ఈ మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది

    ఫ్యాన్స్ కోసమే కంటిన్యూ అవుతూ..

    ఫ్యాన్స్ కోసమే కంటిన్యూ అవుతూ..

    ఈ మధ్యనే ..ఓ రాజకీయ బహిరంగ సభలో పవన్‌కల్యాణ్‌ తన అభిమానుల్ని ఉద్దేశించి 'సినిమాల్ని వదిలెయ్యమంటారా?' అని అడిగారు. ముక్తకంఠంతో 'వద్దు వద్దు' అంటూ చేతులూపారు అభిమానులు. అంటే పవన్‌ని తెరపై చూడటం వాళ్లకి ఎంత ఇష్టమో ఆ సన్నివేశమే చెప్పింది. నిజానికి సినిమాల్ని వదిలిపెట్టాలని పవన్‌కల్యాణ్‌ ఎప్పుడో అనుకొన్నారు. కానీ అభిమానుల అభిప్రాయానికి విలువనిస్తూ ఒకపక్క రాజకీయంలో కొనసాగుతూనే మరోపక్క సినిమాలూ చేస్తున్నారు.

    పవన్ మాటతో దర్శకులకు ఉషారు

    పవన్ మాటతో దర్శకులకు ఉషారు

    ఇక పవన్ కళ్యాణ్ వంటి పవర్ స్టార్ తో చెయ్యా లని ఎవరికు ఉండదు చెప్పండి. దర్శకులంతా తమ కెరీర్ లో ఒక సినిమా అయినా పవన్ తో చెయ్యాలనుకుంటారు. అయితే ఆ మధ్యన పవన్ ఇక సినిమాలు ఆపేస్తారు అనగానే అందరిలో కంగారు మొదలైంది. కానీ ఇప్పుడుపవన్‌ సినీ ప్రయాణం ఇప్పట్లో ఆగదన్న సంకేతాలు బలంగా రావడంతో ఆయనతో సినిమాలు తీయాలనుకొన్న దర్శకులంతా మరింత ఉత్సాహంతో , పవన్‌ని దృష్టిలో ఉంచుకొని విరివిగా కథలు సిద్ధం చేస్తున్నారు.

    తమిళ డైరక్టర్ తోనూ..

    తమిళ డైరక్టర్ తోనూ..

    ప్రస్తుతం డాలీ (కిషోర్‌ పార్థసాని) దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'కాటమరాయుడు'తో పాటు మరో మూడు చిత్రాలకి పవన్‌ కల్యాణ్‌ పచ్చజెండా వూపారు. ఒక చిత్రానికి త్రివిక్రమ్‌, మరొక చిత్రానికి తమిళ దర్శకుడు టి.ఆర్‌.నేసన్‌ తెరకెక్కిస్తారు. మరో చిత్రానికి సంబంధించి తెరపైకొస్తున్న దర్శకుల పేర్లు మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

    వరసపెట్టారు, ఇక ఆపరు

    వరసపెట్టారు, ఇక ఆపరు

    ఒకప్పుడు పరిస్దితి వేరుగా ఉండేది. పవన్‌కల్యాణ్‌ చేస్తున్న సినిమా పూర్తయితే తప్ప, ఆ తర్వాత చేయబోయే సినిమా ఏంటి? ఎప్పుడు సెట్స్‌పైకి వెళుతుందనే విషయంపై స్పష్టత వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఆయన మైండ్ సెట్ మార్చుకున్నారు. భిన్నంగా ఇప్పుడు ఆయన చిత్రాలు లైన్లో ఉన్నాయి. దీంతో పవన్‌ సినిమాలపై అభిమానుల్లో ఆసక్తి మరింతగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే పవన్‌ వేగంగా సినిమాలు చేయడానికి ప్లాన్‌ చేసుకొంటున్నారు.

    త్రివిక్రమ్ తో ముందుకు

    త్రివిక్రమ్ తో ముందుకు

    త్రివిక్రమ్‌ దర్శకత్వంలో పవన్‌ కల్యాణ్‌ చేయనున్న సినిమాకి ముహూర్తం ఖరారైనట్టు సమాచారం. డిసెంబరులోనే ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టబోతునట్లు చెప్పుతున్నారు. అప్పటికి 'కాటమరాయుడు' పూర్తయినా, కాకపోయినా పవన్‌ మాత్రం కొత్త సినిమాకోసం రంగంలోకి దిగాలని నిర్ణయించుకొన్నారట.

    త్రివిక్రమ్ కు లేట్ కాకూడదని

    త్రివిక్రమ్ కు లేట్ కాకూడదని

    తన మిత్రుడు త్రివిక్రమ్‌ తయారు చేసిన కథ పవన్‌కి చాలా బాగా నచ్చిందట. అదొక భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుందని సమాచారం. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై చినబాబు నిర్మిస్తారు. త్రివిక్రమ్..అ..ఆ చిత్రం పూర్తయ్యాక ఇప్పటిదాకా ఇంకో సినిమా మొదలెట్టలేదు. దాంతో మరింత లేటు అవకూడదనే డిసెంబర్ లో మొదలెట్టబోతున్నట్లు చెప్తున్నారు.

    అజిత్ మరో చిత్రం రీమేక్ లో

    అజిత్ మరో చిత్రం రీమేక్ లో

    త్రివిక్రమ్‌ సినిమా పూర్తవ్వగానే తమిళ చిత్రం రీమేక్‌లో నటించబోతున్నారు పవన్‌. టి.ఆర్‌.నేసన్‌ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ఎ.ఎమ్‌.రత్నం నిర్మించబోతున్నారు. ఆ చిత్రం వేదాలం అని తెలుస్తోంది. అజిత్ హీరోగా వచ్చిన ఆ చిత్రం తమిళంలో ఘన విజయం సాధించింది. ఈ మేరుకు తెలుగు నేటివిటితో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

    ఇద్దరూ సాటిస్ ఫై అయ్యే కథ లేకే

    ఇద్దరూ సాటిస్ ఫై అయ్యే కథ లేకే

    పవన్‌కల్యాణ్‌ హీరో గా దాసరి నారాయణరావు ఓ సినిమాని తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారు. మంచి కథ దొరికితే నటించడానికి నేను సిద్ధమే అని పవన్‌ కూడా ప్రకటించారు. అయితే చిక్కంతా కథతోనే వచ్చింది. అటు దాసరి నారాయణరావు, ఇటు పవన్‌ కల్యాణ్‌ కథల గురించి అన్వేషిస్తూనే ఉన్నారు. ఇద్దరినీ సంతృప్తిపరిచే కథ ఎంతకీ దొరకడం లేదు. అయితే ఇటీవలే దాసరి నారాయణరావుకి ఓ కథ నచ్చిందని, అందులోనే పవన్‌కల్యాణ్‌ నటించబోతున్నారని ఫిల్మ్‌ నగర్‌ జనాలు మాట్లాడుకొంటున్నారు.

    బోయపాటి డైరక్షన్ లో నా

    బోయపాటి డైరక్షన్ లో నా

    రీసెంట్ గా దాసరి నారాయణరావు తన సంస్థ తరఫున 'బోస్‌... సన్నాఫ్‌ ఇండియా' అనే పేరును ఫిల్మ్‌ ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారు. అప్పట్నుంచి పవన్‌ నటించనున్న సినిమా కోసమే దాసరి ఆ పేరును రిజిస్టర్‌ చేయించారని, ఆ చిత్రాన్ని బోయపాటి శ్రీను తెరకెక్కించే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది.

    బోయపాటి నో చెప్పాడా

    బోయపాటి నో చెప్పాడా

    'సరైనోడు' తర్వాత బోయపాటి కూడా బెల్లంకొండ కుమారుడు హీరోగా సినిమాని తెరకెక్కిస్తున్నారు. మరి నిజంగానే ఆయనే పవన్‌ చిత్రానికి దర్శకత్వం వహిస్తారా? లేక దాసరి మరో దర్శకుడిని ఎంచుకొనే ప్రయత్నంలో ఉన్నారా? అనే విషయాలపై స్పష్టత రావాల్సి వుంది. కానీ ఫిల్మ్ సర్కిల్స్ వినపడదాన్ని బట్టి తాను వేరే వారు రాసిన కథతో సినిమా చెయ్యనని దాసరికి స్పష్టం చేసినట్లు చెప్పుకుంటన్నారు. కానీ పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో ఆఫర్ వదులుకుంటారా అనేది సందేహం.

    మరోసారి డాలితో

    మరోసారి డాలితో

    గోపాలా గోపాలా తర్వాత.. ఇప్పుడు కాటమరాయుడు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు డాలి. ఇప్పుడీ దర్శకుడు పవన్ తో మూడో సినిమా చేసే ఛాన్సులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. దర్శక రత్న దాసరి నారాయణ రావు నిర్మాణంలో.. పవన్ హీరోగా ఓ సినిమా ఖాయమైన సంగతి తెలిసిందే. నిజానికి ఈ మూవీకి డాలీ ని దర్శకుడిగా అనుకున్నా.. కాటమరాయుడుకి అనుకోని పరిస్థితుల్లో.. ఎస్ జే సూర్య ప్లేస్ లోకి డాలీ వచ్చాడు. అంటే దర్శకరత్న- డాలీ సినిమా కుదిరితే.. పవన్ తో మూడో సినిమా అవుతుందని అంటున్నారు. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలియాలి.

    English summary
    Actress Manasa Himavarsha’s joy knew no boundaries when she was told that she would be a part of Pawan Kalyan’s in-progress film, ‘Katamarayudu’, directed by Dolly. Recalling how she bagged the project, for which she has already begun shooting, she shares, “The makers saw my recent portfolio and offered me the role. I did not have to audition, and director Dolly was happy to take me as it is.”
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X